Ads
కరోనా మహమ్మారి మానవ జీవితాలనే మార్చేసిన సంగతి తెలిసిందే. కరోనా సోకిన ప్రతి ఆరుగురిలో ఒకరు దీర్ఘకాలిక కోవిడ్ తో బాధపడుతున్నారని అంచనా. అంటే.. వీరు దీర్ఘకాలం పాటు కరోనా లక్షణాలతో బాధపడుతున్నారట. వీరిలో దాదాపు రెండువందల లక్షణాలు కనిపించాయని ఇటీవల జరిగిన అంతర్జాతీయ అధ్యయనం చెబుతోంది. ఈ మహమ్మారి సోకిన వారి శరీరం లో పది ముఖ్యమైన వ్యవస్థలు ప్రభావితమయ్యాయట. ఈనాడు కధనం ప్రకారం ఈ అధ్యయనం లో ఇంకా ఏమి పేర్కొన్నారో ఈరోజు చూద్దాం.
Video Advertisement
యూనివర్సిటీ కాలేజీ, లండన్ లోని న్యూరో సైంటిస్ట్ అథెనా అక్రమి ఈ అధ్యయనం లో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. “బ్రిటిష్ దేశం లో చాలా ఆసుపత్రులు శ్వాస సంబంధ సమస్యల పై మాత్రమే దృష్టి పెట్టాయన్నారు. నిజానికి కరోనా సోకిన వారిలో ఆయాసం ఎక్కువగానే కనిపించినా.. ఇతర లక్షణాలు కూడా ఉంటున్నాయి. అందుకే క్లినిక్ లు సంపూర్ణ దృష్టి తో రోగులను పర్యవేక్షించాల్సి ఉంటుంది” అని పేర్కొన్నారు. కరోనా సోకిన వారు ఆరు నెలల నుంచి.. పదహారు నెలల వరకు ఈ లక్షణాలతో బాధపడుతున్నారని ఆమె పేర్కొన్నారు.
అందుకే కరోనా సోకి బాధపడుతున్నవారికి గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, థైరాయిడ్ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. ఇంకా వేలాది మంది ప్రజలు కోవిడ్ వల్లనే అనేక లక్షణాలను ఎదుర్కొంటున్నారు. కానీ.. చాలా మందికి అవి కోవిడ్ వల్లనే వచ్చాయని కూడా తెలియడం లేదు అని ఆమె పేర్కొన్నారు. ఇలా దీర్ఘకాలిక కోవిడ్ తో బాధపడుతున్న వారి కోసం దేశవ్యాప్తం గా క్లీనిక్ ను ఏర్పాటు చేసి.. ఎక్కడిక్కడ చికిత్స చేయించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
ప్రముఖ అంతర్జాతీయ పత్రిక “లాన్సెట్” లో కూడా ఈ అంతర్జాతీయ అధ్యయనం ప్రచురించబడింది. ఈ అధ్యయనం లో 56 దేశాల నుంచి సుమారు 3,672 రోగులను పరిశీలించారట. తద్వారా మొత్తం 203 రోగ లక్షణాలను గుర్తించినట్లు ఈ అధ్యయనం పేర్కొంది. వాటిలో సుమారు 66 లక్షణాలు దీర్ఘకాలిక కరోనా రోగుల్లో ఏడూ నెలల వరకు కొనసాగాయట. వీటిల్లో ప్రముఖం గా నిస్సత్తువ, జ్ఞాపకశక్తి మందగించడం, దృష్టి లోపించడం, నీరసం, దద్దుర్లు రావడం, గుండెదడ, డయేరియా, మూత్రాశయం పై పట్టు లోపించడం వంటి లక్షణాలు కనిపించాయట. చాలా మంది కోవిడ్ వచ్చి వెళ్లిన తరువాత పూర్తి సామర్ధ్యం లో పని చేయలేక.. దీర్ఘకాలిక సెలవలు తీసుకోవడం లేదా పనిని తగ్గించుకోవడం చేశారట. మరో 45 శాతం మంది అయితే గతం లో లా పనిచేయలేకపోవడాన్ని గుర్తించారట.
End of Article