సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది సమంత. పెళ్లి తర్వాత కూడా సాధారణ అమ్మాయిలా కాకుండా నిత్యం ట్రెండీ ఫ్యాషన్ దుస్తులను ధరిస్తూ.. వాటిని ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్లోనూ షేర్ చేసుకుంటూ తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా పంచుకునేది సమంత.
సమంతకు ట్విట్టర్లో 9.8 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా, ఇన్ స్టా లో 24.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అయితే.. సామ్ ప్రస్తుతం సినిమా విషయాల్లో కంటే ఎక్కువ వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది.
దీనికి కారణం సమంత నాగ చైతన్య విడాకులు తీసుకోవడమే! విడాకులు తీసుకోవడం అనేది వారిద్దరి పరస్పర అంగీకారంతో తీసుకున్న నిర్ణయం అయినప్పటికీ సోషల్ మీడియా ఎప్పుడు సమంతనే టార్గెట్ చేసింది. పెళ్లికి ముందే సమంత తెలుగులోని ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి టాప్ హీరోలందరి సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లి తరువాత రామ్ చరణ్ తో నటించిన రంగస్థలం సూపర్ డూపర్ హిట్ అయింది కానీ ఆ సినిమాలో చరణ్ కు సమంత పెట్టిన ముద్దు అప్పట్లో పెద్ద చర్చనీయాంశం అయింది. దానికి సమంత సమాధానం ఇస్తూ.. మా కుటుంబానికి లేని ఇబ్బంది మీకెందుకు అని ఘాటుగానే స్పందించింది.
ఆ తరువాత సామ్ చేసే ప్రతి సినిమాలో ఆమె వేషధారణనే చూడడం ప్రారంభించారు అనేకమంది. పెళ్లయ్యాక అలాంటి దుస్తులు ఏంటీ, ఇలాంటి సీన్లు ఎందుకు అని కామెంట్స్ చేసే వారు. ఇటీవల విడుదలైన ఫ్యామిలీ మ్యాన్ 2 అనే వెబ్ సిరీస్ లో సమంత నటించింది. ఆ తరువాత కొన్ని వ్యక్తిగత కారణాలతో సామ్, చైతూ విడిపోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇక అప్పటి నుంచి సోషల్ మీడియాలో సామ్ ని భీభత్సంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. పెళ్లి అయ్యాక బుద్దిగా పిల్లల్ని కని ఇంటికే పరిమితం అవ్వొచ్చు కదా ఎందుకు ఇవన్నీ అన్నట్టు ఉండేవి వాళ్ళ విమర్శలు.
అయితే సామ్ అభిమానులు మాత్రం వాటికి తీవ్రంగానే బదులిస్తుండే వారు. పెళ్లి అయితే మాత్రం ఇంట్లో కూర్చోవాలా, దుస్తుల ఎంపిక తన వ్యక్తిగత విషయం పైగా పిల్లల్ని ఎప్పుడు కనాలో ఒకరికి మనం ఎలా చెప్తాము. ఆర్టిస్ట్ గా ఇప్పుడు తన లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. తల్లిగా తన లైఫ్ ని షిఫ్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు చేస్తుంది కానీ ఇలా చెయ్ అలా చెయ్ అని చెప్పడానికి మనం ఎవరం అనేది సామ్ అభిమానుల వాదన. పైగా ఇద్దరు పరస్పర అంగీకారంతో విడిపోయాక సామ్ ను చెడుగా భావించకూడదు అని మరికొందరి అభిప్రాయం.
అయితే ఇటీవల సమంత ఓ ట్వీట్ వైరల్ అవుతుంది. “ఓ అమ్మాయిపై నెగటివ్ కామెంట్ వస్తే మాత్రం నిజం అంటారు. అదే అబ్బాయిల మీద వస్తే మాత్రం క్రియేట్ చేసినవి అంటారు అంటూ, ముందు మీ పని మీరు చూసుకోండి” అని చెంప మీద కొట్టినట్టు సమాధానం ఇచ్చారు.
Also Read :
- Samantha : “సమంత” లేటెస్ట్ ఫోటోల వెనకాల ఇంత స్టోరీ ఉందా..?
- సమంత చెప్పడంతోనే… నాగ చైతన్య ఆ నిర్ణయం తీసుకున్నారా..?
- ఆ హీరోయిన్ తో నాగ చైతన్య డేటింగ్ రూమర్ పై “సమంత” రియాక్షన్ ఇదే…మగవారి మీద రూమర్స్ వస్తే.?
- “చై – సామ్ విడిపోతే అంత పర్సనల్ గా ఎందుకు ఫీల్ అవుతున్నావు?” అని అడిగితే…ఓ ఫ్యాన్ చెప్పిన 5 కారణాలు ఇవే.!