2024 ఐపీఎల్ సీజన్ వేడి అప్పుడే మొదలైపోయింది. ఆటగాళ్ల రిటైనింగ్, రిలీజింగ్ లతో హడావిడి నెలకొంది. ఇప్పటికే అన్ని టీములు తమతో అంటిపెట్టుకుంటున్న ప్లేయర్లను ప్రకటించాయి. కొన్ని టీమ్స్ అయితే కీలకమైన ప్లేయర్లను వేలానికి వదిలేసాయి. గత సీజన్ లో భారీ మొత్తం పెట్టికొన్న చాలామంది ప్లేయర్లు ఈ సీజన్ లో రిలీజ్ అయిపోయారు.
అయితే ఇప్పుడు అందరి దృష్టి ఐపిఎల్ మినీ వేలం పై పడింది. డిసెంబర్ లో దుబాయ్ లో జరిగే మినీ వేలంలో స్టార్ ఆటగాళ్లను దక్కించుకునేందుకు అన్ని ఫ్రాంచిజీలు తమ వద్ద ఉన్న డబ్బులతో సిద్ధంగా ఉన్నాయి. అయితే భారీ పోటీ ఉండేది మాత్రం ఈ ఆరుగురు ప్లేయర్స్ కోసమే అని అంటున్నారు. ఇంతకీ ఎవరు ఆ ప్లేయర్లు…
1.మిచెల్ స్టార్క్:
ప్రపంచకప్‌లో అద్బుత ప్రదర్శన కనబర్చిన ఆస్ట్రేలియన్ పేసర్ మిచెల్ స్టార్క్ తిరిగి ఐపీఎల్ ఎంట్రీ ఇవ్వడంతో అన్ని ఫ్రాంచైజీలు అతనిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాయి. ఫేస్ బౌలింగ్ తో వరల్డ్ కప్ లో స్టార్క్ చెలరేగిపోయాడు.
2. ఆడమ్ జంపా:
అదే విధంగా మరో ఆస్ట్రేలియన్ స్పిన్నర్ ఆడమ్ జంపా కోసం కూడా వేలంలో పోటీ ఉండబోతోంది. ఆడమ్ జంపా కూడా వరల్డ్ కప్ లో అద్భుతంగా ప్రదర్శించాడు.
3.ట్రేవిస్ హెడ్:
ఇక ప్రపంచకప్‌లో హీరోగా నిలిచిన ఆల్‌రౌండర్ ట్రేవిస్ హెడ్ కోసం తీవ్రంగా పోటీ ఉండవచ్చు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రెండింటి లోనూ ట్రేవిస్ హెడ్ అద్భుతంగా రాణించడమే ఇందుకు కారణం. ఆస్ట్రేలియా వరల్డ్ కప్ నెగ్గడానికి ప్రధాన కారణం ట్రేవిస్ హెడ్ నే.
4.ప్యాట్ కమ్మిన్స్:
అద్భుతమైన కెప్టెన్సీ తో ఆస్ట్రేలియాకు కప్ అందించిన ప్యాట్ కమ్మిన్స్పై కూడా ఫ్రాంచైజీలు దృష్టి పెడుతున్నాయి. అతఎన్ని దక్కించుకునేందుకు కూడా పోటీ గట్టిగా ఉంటుంది .
5.డారిలి మిచెల్:
ఇక న్యూజిలాండ్ ఆటగాడు డారిలి మిచెల్ కూడా వరల్డ్ కప్ లో మంచిగా రాణించాడు. అతను కూడా వేలంలో మంచి ధరకే అమ్ముడు అయ్యే అవకాశం ఉంది. టీమ్‌ల మధ్య పోటీ కూడా గట్టిగా ఉండొచ్చు.
6. రచిన్ రవీంద్ర:
న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర కోసం కూడా టీం గట్టిగా పోటీ పడతాయి. ఈ వరల్డ్ కప్ లో రచిన్ రవీంద్ర సూపర్ పెర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకున్నాడు.
Also Read:ఆ రెండు గంటల్లో ఏమైంది.? ఎంత మొత్తంలో డబ్బు చేతులు మారింది.?