హార్దిక్ పాండ్యా ని తీసుకోవడం కోసం…ముంబై ఇండియన్స్ ఇంతమంది ప్లేయర్స్ ను వదిలేయాల్సి వచ్చిందా….!

హార్దిక్ పాండ్యా ని తీసుకోవడం కోసం…ముంబై ఇండియన్స్ ఇంతమంది ప్లేయర్స్ ను వదిలేయాల్సి వచ్చిందా….!

by Mounika Singaluri

ప్రపంచ కప్పు ముగిసిపోయిన వెంటనే అందరి దృష్టి ఐపిఎల్ పై పడింది. 2024 లో జరిగే ఐపీఎల్ కోసం ఇప్పటినుండే టీం లన్ని కూడా ప్లేయర్స్ ని సిద్ధం చేస్తున్నాయి. ఇప్పుడు ఐపీఎల్ లోనే బిగ్గెస్ట్ టీమ్ అయిన ముంబై ఇండియన్స్ టీం కూర్పు పైన దృష్టి పెట్టింది. ఒకప్పుడు ముంబై ఇండియన్స్ కి ఆడిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా ఉన్నాడు. ఇప్పుడు అతన్ని రిటైన్ చేసుకునేందుకు ఏకంగా 15 కోట్ల రూపాయలను గుజరాత్ టైటాన్స్ కి చెల్లించింది.

Video Advertisement

ప్రస్తుతం ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ కెరీర్ చివరి దశకు రావడంతో హార్దిక్ పాండ్యా ను బ్యాకప్ లో ఉంచుకుంటే టీం బలపడుతుందని టీం కి పూర్వ వైభవం వస్తుందని ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ భావిస్తుంది.

హార్దిక్ పాండ్యా కోసం గత వేలంలో రూ. 17.50 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన కామెరూన్ గ్రీన్‌తో పాటు ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌లను వదులుకునేందుకు ముంబై ఇండియన్స్ సిద్దమైంది. 2022 మెగా వేలంలో రూ. 8 కోట్లు పెట్టి జోఫ్రా ఆర్చర్‌ను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఆ సీజన్ ఆడడని తెలిసినా.. అతనిపై అంత ధర పెట్టి రిస్క్ చేసింది.కామెరూన్ గ్రీన్, జోఫ్రా ఆర్చర్‌లను వదిలేయడం ద్వారా ముంబైకి పర్స్ మనీలో రూ.25.50 కోట్లు మిగులుతాయి.

ఇందులో నుంచి హార్దిక్ పాండ్యాకు రూ. 15 కోట్లు ఇచ్చినా.. మరో రూ.10.50 కోట్లు ఉంటాయని, ఈ డబ్బుతో దుబాయిలో జరిగే మినీ వేలంలో కావాల్సిన ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చని ముంబై ఇండియన్స్ భావిస్తోంది.ఆదివారంతో ఐపీఎల్ 2024 సీజన్‌కు సంబంధించిన ట్రేడింగ్ విండోతో పాటు రిలీజ్, రిటైన్ ఆటగాళ్ల జాబితాలను సమర్పించే గడువు ముగుస్తోంది. ఆదివారం సాయంత్రానికి పది ఫ్రాంచైజీల రిటైన్, రిలీజ్ చేసిన ప్లేయర్ల జాబితాలను బీసీసీఐ అధికారికంగా ప్రకటించనుంది.

Also Read:రోహిత్ వెళ్లిపోయాడు…. హార్దిక్ వచ్చాడు..! IPL 2024 లో చేయబోతున్న 6 మార్పులు ఇవే..!


You may also like

Leave a Comment