రోహిత్ వెళ్లిపోయాడు…. హార్దిక్ వచ్చాడు..! IPL 2024 లో చేయబోతున్న 6 మార్పులు ఇవే..!

రోహిత్ వెళ్లిపోయాడు…. హార్దిక్ వచ్చాడు..! IPL 2024 లో చేయబోతున్న 6 మార్పులు ఇవే..!

by Mounika Singaluri

Ads

2023 ప్రపంచ కప్ హడావిడి ముగిసిపోయింది. ఇప్పుడు దృష్టంతా ఐపీఎల్ పై పడింది. 2024లో జరిగే ఐపీఎల్ కోసం డిసెంబర్ 19వ తారీఖున దుబాయిలో ఆటగాళ్ల మినీ వేలం జరగనుంది. ఐపీఎల్ టీమ్లన్నీ కూడా కొంతమంది ప్లేయర్లను అంటి పెట్టుకోవడం మరికొందరిని వదిలేసుకోవడం పైన దృష్టి పెట్టాయి. ఈలోగా తమ టీం లో ఉన్న బలాబలాలను బెరీజు వేసుకుంటున్నాయి. ప్రపంచ కప్పులో రాణించిన ప్లేయర్ల పైన అన్ని టీంలు దృష్టి సారిస్తున్నాయి.

Video Advertisement

అయితే తాజాగా గుజరాత్ టైటాన్స్ హార్దిక్ పాండ్యాను ముంబైకి వదిలేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. జోఫ్రా ఆర్చర్ స్థానంలో హార్దిక్ ముంబై జట్టులోకి వస్తున్నట్లు తెలుస్తుంది. అయితే గుజరాత్ ముంబై ప్లేయర్ని తీసుకోకుండా 15 కోట్లు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.

1.అలాగే రోహిత్ ను గుజరాత్ టైటాన్స్ తీసుకుంటుంది అనే వార్త కూడా వినిపిస్తుందని దానిపైన స్పష్టత లేదు. ముంబై టీం కూడా రోహిత్ ని కొనసాగించాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.క్రితం వేలంలో ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన విదేశీ ప్లేయర్‌గా సామ్‌ కర్రాన్‌ చరిత్ర సృష్టించాడు.

2.పంజాబ్‌ కింగ్స్‌ అతడిని ఏకంగా రూ.18.50 కోట్లకు కొనుగోలు చేయగా, ఆడిన 14 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు మాత్రమే తీసి దారుణంగా నిరాశపరిచాడు. దీంతో ఈసారి పంజాబ్‌ అతడిని వదిలేసి భారీ మొత్తాన్ని ఆదా చేసుకోవాలనుకుంటోంది.

3.అలాగే వచ్చే ఏడాది ఐపీఎల్‌కు దూరమవుతానని ప్రకటించిన స్టోక్స్‌ను సైతం చెన్నై సూపర్‌ కింగ్స్‌ రిలీజ్‌ చేయాలనుకుంటోంది. అతడిపై రూ.16.25 కోట్లు వెచ్చించినా ఆడింది రెండు మ్యాచ్‌లే.

4.మరోవైపు రూ.13.25 కోట్లతో కొనుగోలు చేసిన హ్యారీ బ్రూక్‌పై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ భారీగా ఆశలు పెట్టుకున్నా ఎలాంటి ఫలితం లేకపోయింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నుంచి ఎక్కువ మంది ఆటగాళ్లు వేలానికి వెళ్లనున్నారు.

head

5.కేకేఆర్‌కు ఆడుతున్న ఆండ్రీ రస్సెల్‌, సునీల్‌ నరైన్‌లను కూడా వదిలేసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. అయితే రస్సెల్‌పై ఇంకా నమ్మకమున్నట్టు చెబుతున్నారు. అలాగే పేసర్‌ శార్దూల్‌ ఠాకూర్‌, ఉమేశ్‌ యాదవ్‌, ఫెర్గూసన్‌, సౌథీ, షకీబ్‌, లిట్టన్‌ దాస్‌, డేవిడ్‌ వీస్‌ వేలంలో కనిపించనున్నారు.

6.అలాగే వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా కి ఫైనల్ మ్యాచ్ కీలకంగా ఆడిన ట్రావిస్ హెడ్ ను టీములు దక్కించుకోవాలని చూస్తున్నాయి. అలాగే న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర పైన కూడా ఆసక్తి కనబరుస్తున్నాయి.

 

Also Read:ఇదేదో ఫైనల్ లో ఆడి ఉంటే కప్ అయినా కొట్టే వాళ్ళం కదయ్యా..?” అంటూ… ఈ ప్లేయర్ పై కామెంట్స్..


End of Article

You may also like