“ఇదేదో ఫైనల్ లో ఆడి ఉంటే కప్ అయినా కొట్టే వాళ్ళం కదయ్యా..?” అంటూ… ఈ ప్లేయర్ పై కామెంట్స్..!

“ఇదేదో ఫైనల్ లో ఆడి ఉంటే కప్ అయినా కొట్టే వాళ్ళం కదయ్యా..?” అంటూ… ఈ ప్లేయర్ పై కామెంట్స్..!

by Mounika Singaluri

Ads

2023 ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో మిస్టర్ 360 గా పేరున్న సూర్య కుమార్ యాదవ్ అనుకున్నంతగా పెర్ఫార్మ్ చేయలేకపోయాడు. అయితే తాజాగా ఆస్ట్రేలియాతో భారత్ 5 మ్యాచ్ ల టి20 సిరీస్ ను ఆడుతుంది.తాజాగా మొదటి మ్యాచ్ వైజాగ్ లో జరిగింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 209 పరుగుల భారీ స్కోరు చేసింది.

Video Advertisement

వరల్డ్ కప్ ఆడిన సీనియర్ లు అందరికీ విశ్రాంతి ఇచ్చారు. కుర్రాళ్లను ఈ t20 సీరీస్ కి ఎంపిక చేశారు. 2024 t20 ప్రపంచ కప్పును దృష్టిలో పెట్టుకుని టీం సెలెక్షన్ చేస్తున్నారు. సూర్య కుమార్ యాదవ్ ను టీం కెప్టెన్ గా నియమించారు.

అయితే 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 22 పరుగులకే రెండు వికెట్ లు కోల్పోయి కష్టాల్లో పడింది. తర్వాత బ్యాటింగ్ వచ్చిన సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ తో కలిసి మంచి పార్ట్నర్ షిప్ ను నమోదు చేశాడు. ఇషాన్ కిషన్ 58 పరుగులతో ఆకట్టుకున్నాడు. సూర్యా అయితే 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని సెంచరీ వైపు దూసుకు వెళ్ళాడు. ఒక భారీ షార్ట్ ఆడబోయి క్యాచ్ అవుట్ అయ్యాడు. అయితే సూర్య ఈ మ్యాచ్ లో 42 బంతులాడి 9 ఫోర్లు ,నాలుగు సిక్స్ లతో 80 పరుగులు చేశాడు.

తనకే సాధ్యమైన 360 డిగ్రీస్ షాట్లతో అభిమానులను అలరించాడు. అయితే సూర్య పెర్ఫార్మెన్స్ చూసిన భారత్ అభిమానులు వరల్డ్ కప్ లో నీకు ఏమైంది అన్న ఇలా ఆడుండొచ్చు కదా అంటూ కామెంట్ లు పెడుతున్నారు. సూర్య కనీసం 40 పరుగులు చేసి ఉంటే భారత్ స్కోరు 280 దాకా వచ్చేది. అప్పుడు భారత్ వరల్డ్ కప్ నెగ్గే అవకాశాలు ఉండేవి. వరల్డ్ కప్ లో సరిగ్గా ఆడలేక సింగిల్స్ తీస్తూ చిరాకు తెప్పించాడు.T20 లో ఆడిన ఫామ్ కనుక వరల్డ్ కప్ లో ఉండి ఉంటే వేరే లెవల్లో ఉండేదని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Also Read:ఇండియన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ ఆస్తుల విలువ ఎంతో తెలుసా….?


End of Article

You may also like