ఆ రెండు గంటల్లో ఏమైంది.? ఎంత మొత్తంలో డబ్బు చేతులు మారింది.?

ఆ రెండు గంటల్లో ఏమైంది.? ఎంత మొత్తంలో డబ్బు చేతులు మారింది.?

by Mounika Singaluri

Ads

నిన్న జరిగిన ఐపీఎల్ ప్లేయర్ల రిటైన్ ఒక సస్పెన్స్ సినిమాను మించింది. రెండు రోజులుగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిందనే వార్త బాగా హల్చల్ చేసింది. గుజరాత్ టైటాన్స్ కు 15 కోట్లు చెల్లించిందని కూడా ప్రచురించారు. అయితే నిన్న ఐపిఎల్ లో రిలీజింగ్, రిటైనింగ్ ప్లేయర్ల లిస్టు ప్రకటించే ముందు సాయంత్రం 05:30 నిమిషాలకు గుజరాత్ టైటాన్స్ హార్దిక్ పాండ్యాను రిటైన్ చేసుకున్నట్లుగా ప్రకటించింది.

Video Advertisement

అయితే తర్వాత 07:30 మళ్లీ హార్దిక్ పాండ్యాను తాము దక్కించుకున్నట్లుగా ముంబై ఇండియన్స్ ప్రకటించింది. అయితే ఈ రెండు గంటల్లో ఏం జరిగిందని ఎవరికి అర్థం కాలేదు.హార్దిక్ పాండ్య గతంలో ముంబై ఇండియన్స్ కి ఆరు సంవత్సరాలు ఆడాడు. తర్వాత ఫామ్ కోల్పోవడంతో ముంబై హార్దిక్ పాండ్యాను వదిలేసింది.

తర్వాత 2022లో గుజరాత్ టైటాన్స్ టీం రావడం, హార్దిక్ పాండ్యాని 15 కోట్లకు వేలం లో దక్కించుకోవడం కెప్టెన్సీ అప్పగించడం జరిగింది. అయితే 2023 లో కూడా అదే మొత్తం చెల్లించి టీం లో కొనసాగించింది.అయితే హార్దిక్ పాండ్యా కి గుజరాత్ టైటాన్స్ టీం తో ఆర్థిక పరమైన విభేదాలు ఉన్న కారణంగానే ముంబై టీం పక్కన చేరాడు అని అంటున్నారు. అయితే హర్దిక్ పాండ్య ను ట్రేడ్ చేసుకోవడానికి గుజరాత్ టైటాన్స్ టీం ఒప్పుకోకపోవడంతో ముంబై ఇండియన్స్ భారీ మొత్తం చెల్లించి హార్దిక్ పాండ్యా ను కొనుగోలు చేసిందట.

ముంబై 15 కోట్లకి రెట్టింపు చెల్లించిందని పంతం కోసమే ఈ డీల్ చేసిందని క్రికెట్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.అయితే నిన్నటి నుండి దేశం అంతా దీని గురించి చర్చ నడుస్తుంది. ఐపీఎల్ అంటే ఎంత క్రేజ్ ఉందో ఈ ఒక్క వార్త చదివితే తెలుస్తుంది. అంబానీ కొనేశాడు హార్దిక్ ను కొనేశాడు అంటూ వార్తలు గట్టిగా హల్చల్ చేస్తున్నాయి. పోటా పోటీగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ ప్రకటనలు చేయడం చూస్తుంటే ఐపీఎల్ కోసం ఫ్రాంచైజీలు ఎంత దాకా అయిన వెళ్తాయి అని అనిపిస్తుంది.

 

Also Read:హార్దిక్ పాండ్యా ని తీసుకోవడం కోసం…ముంబై ఇండియన్స్ ఇంతమంది ప్లేయర్స్ ను వదిలేయాల్సి వచ్చిందా…!


End of Article

You may also like