తాజాగా నిన్న నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అయితే మిగతా మూడు రాష్ట్రాల్లో కూడా బిజెపి తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బిజెపి 163 సీట్లు చేసుకుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ 66 సీట్లతో సరిపెట్టుకుంది. బిజెపికి సంపూర్ణ మెజార్టీ లభించింది. రాజస్థాన్ లో కూడా దాదాపు ఇదే సీన్ రిపీట్ అయింది. బిజెపికి 115 సీట్లతో అధికారం లభించింది. కాంగ్రెస్ పార్టీ 69 సీట్లతో రెండో స్థానంలో నిలబడగా, బహుజన సమాజ్ పార్టీ రెండు సీట్లను కైవసం చేసుకుంది.
ఛత్తస్గఢ్ లో కూడా బిజెపి 54 సీట్లతో అధికారంలోకి రాక కాంగ్రెస్ పార్టీ 35 సీట్లు సాధించింది. ఈ మూడు రాష్ట్రాలను బిజెపి సంపూర్ణ మెజారిటీతో ఆధిపత్యం చూపించింది.దీంతో బిజెపి నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. అంతేకాకుండా గతంలో కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు చేసిన విమర్శలను దీటుగా తిప్పికొడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ నుండి బిజెపిలోకి వెళ్లిన జ్యోతిరాదిత్యా సింధియాను ఉద్దేశించి గతంలో కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ విమర్శలు చేశారు.ఆయన ప్రజల తీర్పును అపహస్యం చేశారని అహంకారం ఎక్కువని వ్యాఖ్యానించారు.అదే సమయంలో ఎత్తు గురించి కూడా ప్రస్తావించారు. బిజెపి నేతలంతా చాలా విచిత్రంగా ఉంటారు. ముందుగా మన సింధియా.ఉత్తర ప్రదేశ్ లో నేను ఆయనతో కలిసి పని చేశాను. ఆయన దగ్గరకు వెళ్లే కార్యకర్త ఎవరైనా సరే ఆయనను మహారాజ్ అని పిలవాలి, లేదంటే వారి సమస్యలు పరిష్కారం కావు. ఆయన కాంగ్రెస్ కు గ్వాలియర్,చంబా ప్రజలకు ద్రోహం చేశారు.
బిజెపితో చేతులు కలిపి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టారు అంటూ విమర్శించారు. అయితే దీనిపై తాజాగా సిందిగా కౌంటర్ ఇచ్చారు కొంతమంది నా ఎత్తు గురించి మాట్లాడారు. ఎంత ఎత్తులో ఉన్నామో గ్వాలియర్ మాల్వా ప్రజలు చూపించారని జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బదులిచ్చారు. అయితే ఈ ప్రాంతంలో సింధియా కుటుంబానికి పట్టు ఎక్కువగా ఉంది.సింధియా చేసిన కౌంటర్ వ్యాఖ్యలు పైన బిజెపి నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read:బర్రెలక్కకు ఎన్ని ఓట్లు పడ్డాయో తెలుసా..? ఓటమి తర్వాత ఆమె ఏం నిర్ణయం తీసుకున్నారంటే.?