మాస్ మహారాజా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా నిన్న దసరా కానుకగా విడుదలైంది. అయితే ఈ సినిమా కొన్ని సెంటర్లో మంచి టాకింగ్ తెచ్చుకోగా మరి కొన్నిచోట్ల మిక్సడ్ రివ్యూస్ ని పొందింది. భారీ ఎక్స్పెక్టేషన్స్ నడుము వచ్చిన ఈ సినిమా రవితేజ అభిమానులకు ఫుల్ మీల్స్ అనే చెప్పాలి.
రవితేజ లుక్కు కూడా సినిమాలో చాలా కొత్తగా ఉంది. ఎమోషనల్ సీన్స్ డైలాగ్స్ కూడా బాగా వర్క్ అవుట్ అయ్యాయి. కాకపోతే సినిమానిది బాగా ఎక్కువ అవ్వడం కొన్నిచోట్ల ల్యాగ్ ఉండటం వల్ల ప్రేక్షకులు అసహనానికి గురవుతారు.
అయితే రవితేజ కోసం, కొత్త ఎక్స్పీరియన్స్ కోసం, స్టువర్టుపురం దొంగ కథను తెలుసుకోవాలంటే ఈ సినిమాను తప్పక చూడాల్సిందే.అయితే ఈ సినిమా చూసిన ప్రేక్షకులు కొన్ని సీనులను చూసి ఈ సినిమాకి ఈ సీన్లు అవసరమా అంటూ పెదవి విరుస్తున్నారు. కే జి ఎఫ్ లాంటి సినిమాలకు ఆ సీన్లు వర్తిస్తాయి గానీ, టైగర్ నాగేశ్వరరావు సినిమాకు సెట్ అవ్వలేదని అంటున్నారు. కే జి ఎఫ్ సినిమాలో హీరో పార్లమెంటుకి వెళ్లి మంత్రిని చంపిన ప్రధానమంత్రి కి వార్నింగ్ ఇచ్చినా కూడా చెల్లిపోయింది. దాన్ని ఎలివేషన్ తప్ప ఎబెట్టుగా అనుకోలేదు.
ప్రధానమంత్రి ఇంట్లో దొంగతనం చేస్తానని టైగర్ నాగేశ్వరరావు లెటర్ రాసిన సీను పైన పేక్షకులు భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఎలా దొంగతనం చేస్తాడా అంటూ ఎక్సైటింగ్ గా చూసారు. కాకపోతే సినిమాలో టైగర్ నాగేశ్వరరావుకు భయపడి ప్రధానమంత్రి సెక్యూరిటీ అలర్ట్ అయినట్టు చూపించారు. అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ జోక్యం చేసుకొని తన సెక్యూరిటీని రంగంలోకి దింపేంత సీన్ టైగర్ నాగేశ్వరరావు కి లేదు.
అయితే పీఎం సెక్యూరిటీ నే బోల్తా కొట్టించి ప్రధాని ఇంట్లో దొంగతనం చేసినట్లు, పియం సెక్యూరిటీ అధికారి తన గురించి తెలుసుకునేందుకు ఇక్కడికి వచ్చినట్లు ఇంకా టైగర్ గొప్పదనం తెలుసుకుని పిఎం ఇందిరా గాంధీ అతని కొనియాడినట్లు ఇలా క్రియేటివిటీని పూర్తిగా హద్దులు దాటించేశారు. దీనికి కనెక్ట్ అవ్వని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.
ఒక బయోపిక్ సినిమా తీస్తున్నప్పుడు లాజిక్కులు పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఫిక్షనల్ స్టోరీస్ కైతే క్రియేటివిటీని చూపించడంలో ఏ అడ్డు ఉండదు. కే జి ఎఫ్ సినిమా అందుకే అంత సక్సెస్ అయింది. టైగర్ నాగేశ్వరరావు సినిమా బాగున్నా కూడా ఇలాంటి సీన్లు కాస్త ఇబ్బందికరంగానే అనిపించాయి.
Also Read: TIGER NAGESWARA RAO REVIEW : “రవితేజ” నటించిన ఈ బయోపిక్ ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!