భారత్-పాకిస్తాన్ చిరకాల ప్రత్యర్థులు. రెండిటి మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగిందంటే అది హోరాహోరీగా సాగుతుంది. రెండు టీములు కూడా గెలిచేందుకు తీవ్రంగా శ్రమిస్తూ ఉంటాయి. అయితే ఇప్పటివరకు పాకిస్తాన్ మీద భారతదే పై చేయిగా ఉంది. వరల్డ్ కప్ లాంటి టోర్నమెంటులో అయితే తాను నెగ్గకపోయినా పర్వాలేదు భారత్ ఓడిపోవాలని పాకిస్తాన్ ఎప్పుడూ కోరుకుంటూ ఉంటుంది.
అలాంటిది భారత్ గెలిచిందని పాకిస్తాన్ హ్యాపీగా ఉందంట. అసలు ఎందుకు పాకిస్తాన్ కి అంత హ్యాపీ. ఈ స్టోరీ చదవండి.లక్నో వేదికగా జరిగిన మ్యాచ్ లో భారత్ ఇంగ్లాండ్ ని 100 పరుగుల తేడాతో చిత్తుచిత్తుగా ఓడించింది.
అయితే ఇంగ్లాండ్ ఇంకా మూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఈ మూడింట ఇంగ్లాండ్ నెగ్గిన కూడా మాక్సిమం ఎనిమిది పాయింట్లు మాత్రమే సాధిస్తుంది. భారత్ కన్నా ముందు శ్రీలంక చేతిలో కూడా ఇంగ్లాండ్ దారుణమైన ఓటమిని పొందింది.ఇప్పుడు టేబుల్ లో టాప్ మూడు ప్లేసుల్లో ఉన్న భారత్, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా జట్టులు దాదాపు సెమీస్ అవకాశాలను ఖరారు చేసుకున్నాయి. ఇక మిగిలిన ఒక స్థానం కోసం పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ పోటీ పడుతున్నాయి.
ఇప్పుడు ఇంగ్లాండ్ భారత్ చేతుల్లో ఓడింది. పాకిస్తాన్ ఇప్పటివరకు రెండు మ్యాచ్ ల్లో నెగ్గింది. ఇంకా మూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. అంటే చివరి మూడు మ్యాచ్ లలో గెలిస్తే పాకిస్తాన్ 10 పాయింట్లు సాధిస్తుంది. నెట్ రన్ రేట్ ప్రకారం చూసుకున్న, పాయింట్ల ప్రకారం చూసుకున్న ఇంగ్లాండ్ కన్నా మెరుగ్గా ఉంటుంది. అదే జరిగితే ఇంగ్లాండ్ కన్నా పాకిస్తాన్ కి సెమీస్ అవకాశాలు ఎక్కువ. నిన్న ఇంగ్లాండ్ ను ఓడించినందుకు పాక్ అభిమానులు భారత్ కి థాంక్స్ చెప్తున్నారు. ఇది అసలు కథ.