తాజాగా రిలీజ్ అయిన సర్కారు వారి పాట మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకొని బాక్సాఫీస్ వద్ద బాగానే కనెక్ట్ అయిందని అంటున్నారు.ఈ వీకెండ్ తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చెప్పలేము కానీ మూవీ మాత్రం బాగానే దూసుకుపోతుంది. ఈ మూవీలో కళావతి అనే పాత్రలో కీర్తి సురేష్ నటించింది.
సినిమా మొదటి భాగంలో మహేష్ ను మైమరపించి డబ్బులు కొట్టేసే అమ్మాయి గా నటించింది. అయితే కీర్తి పక్కన కళావతి ఫ్రెండ్ గా నటించిన అమ్మాయి కూడా హీరోయిన్ కు ఏ మాత్రం తీసుపోలేదు అని చెప్పవచ్చు. అంత అందంగా ఉన్న అమ్మాయి ఎవరు.. ఆ అమ్మాయికి ఇదే మొదటి సినిమానా..? 
ఇప్పటివరకు ఏమైనా సినిమాల్లో నటించిందా అంటూ నెట్టింట్లో ఈ అమ్మడి గురించి చాలా మంది నెటిజన్స్ సెర్చ్ చేస్తున్నారు. అయితే ఆ అమ్మాయి కూడా హీరోయినేనట. ఆమె ప్రస్తుతం లెహరాయి, టాక్సీ అనే మూవీల్లో నటిస్తోందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈమె పేరే సౌమ్య మీనన్. సర్కారు వారి పాట సినిమాలో ఈమె పాత్ర పేరు కూడా సౌమ్యనే.. ఈ అమ్మడు మలయాళీ లో చాలా సినిమాల్లో నటించింది.

సర్కారు వారి పాట మూవీ లో ఫస్ట్ హాఫ్ లో కనిపిస్తుంది. ఇందులో కీర్తి సురేష్ ని ఎంకరేజ్ చేస్తూ మహేష్ బాబు దగ్గర డబ్బులు కొట్టేయమని చెప్పేది ఈ అమ్మాయి. ఈమె పాత్రే ఈ సినిమాలో కీలక మలుపు తీసుకుంటుంది. కాని సెకండ్ హాఫ్ లో ఈ అమ్మడు కనిపించదు. అయితే ఈమెకు ఈ పాత్ర కెరీర్లో ఉపయోగపడే ఛాన్సుందని అంటున్నారు.

ఈ తప్పిదానికి మహేష్ సీరియస్ అవ్వలేదని ఆ సమయంలో చాలా కూల్ గా వ్యవహరించాడని తెలియజేసింది. సర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్ కు ఒక మంచి పాత్ర ఉందని తెలుస్తోంది. ఈ సినిమా గురించి మహేష్ బాబు చెప్పినప్పుడు ఆయన అందులో హీరోగా నటించడమే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా చేస్తానని చెప్పడం విశేషం.
ఈ సినిమాలోని కథ మరియు కథనం గురించి మహేష్ బాబు చెప్పినప్పుడు చాలా బాగుందని చేద్దామని చెప్పడం తో డైరెక్టర్ పరశురాం చాలా ఆనందించారట. అయితే ఈ కథనం రాసింది స్పెషల్ గా మహేష్ బాబు కోసమేనని ఆయన అంటున్నారు. మహేష్ బాబుతో ఒక సాంగ్ చేస్తున్న సమయంలో కీర్తి సురేష్ ఒక స్టెప్ లో కొంచెం కోఆర్డినేషన్ మిస్ అయిందట. 





