Nayanthara: సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ అనగానే గుర్తొచ్చే పేరు నయనతార. నయనతార మలయాళంలో మనస్సినక్కరే అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
ఈ మూవీలో హీరో జయరామ్. 2005లో వచ్చిన తమిళంలో అయ్యా, రజనీకాంత్ చంద్రముఖి మూవీ నయనతారకు మంచి విజయాన్ని ఇచ్చాయి. ఆ తర్వాత నయనతార నటించిన గజిని, లక్ష్మి, బాస్, యోగి సినిమాలు ఆమెను తమిళ మరియు తెలుగు సినీ పరిశ్రమల్లో బిజీ నటిగా మార్చాయి. అగ్ర నటులందరితోనూ నటించి, మెప్పించింది. సౌత్ సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ నయనతార.
సినిమాల ద్వారా ఎంతో పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకున్న నయనతార ఇటీవల తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌ని వివాహం చేసుకుంది.పెళ్లి అయిన నెలకే సరోగసి ద్వారా తల్లి అయ్యి వార్తల్లో నిలిచింది. నయన్ ఆస్తుల విలువ దాదాపు రూ. 100 కోట్లు అని అంచనా. దక్షిణ భారతదేశంలోని అత్యంత ధనిక హీరోయిన్స్ లో ఒకరు. ఆమెకు చెన్నైలో విలాసవంతమైన విల్లాలు, అపార్ట్మెంట్లు, విలాసవంతమైన కార్లు మరియు ప్రైవేట్ జెట్ కూడా ఉన్నాయి.
నయనతారకు ఉన్న 8 ఖరీదైన వస్తువుల జాబితా ఏంటో చూద్దాం..
1. రౌడీ పిక్చర్స్ ప్రొడక్షన్ హౌస్ విలువ రూ. 50 కోట్లు
నయనతార మరియు విఘ్నేష్ శివన్ కలిసి రౌడీ పిక్చర్స్ బ్యానర్‌ను మొదలుపెట్టారు. ఇది 50 కోట్ల రూపాయల విలువ ఉన్న నిర్మాణ సంస్థ.
2. విలువైన ఆస్తులు
నయన్ హైదరాబాద్, చెన్నై, ముంబైలలో 4 BHK అపార్ట్మెంట్లతో సహా రూ. 100 కోట్ల ఆస్తి ఉంది.
3.కాస్మెటిక్ బ్రాండ్ ‘ది లిప్ బామ్ కంపెనీ’
కాస్మెటిక్ సర్జన్ అయిన రెనితా రాజన్‌తో కలిసి నయనతార కాస్మెటిక్ బ్రాండ్ ‘ది లిప్ బామ్ కంపెనీ’స్టార్ట్ చేసింది. దీని విలువ రూ.10 కోట్లు
4. ప్రైవేట్ జెట్
నయనతార & విఘ్నేష్ శివన్ లకు రూ. 50 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్‌ను ఉన్నట్లు తెలుస్తోంది.
5. మెర్సిడెస్ GLS 350D
రూ. 88 లక్షల విలువ కలిగిన మెర్సిడెస్ GLS 350D ఉంది.
6.BMW 7-సిరీస్ ధర రూ. 1.76 కోట్లు
7.టయోటా ఇన్నోవా క్రిస్టా విలువ రూ. 30 లక్షలు
8. రూ. 74.50 లక్షల విలువైన BMW 5 సిరీస్

https://wirally.com/expensive-things-owned-by-nayanthara/

తిరు ఫుడ్ డెలివరీ బాయ్ గా పని చేసే క్రమంలో అనూష, రంజనిలను ప్రేమిస్తాడు అయితే వారు అతన్ని ప్రేమించరు. నిరాశలోకి వెళ్ళిన అతన్ని వాళ్ల తాత శోభన స్నేహాన్ని, ప్రేమగా చెప్పడంతో అక్కడ నుండి కథ మలుపు తీసుకుంటుంది.
అయితే ఈ సినిమా అభిమానులకు నచ్చినప్పటికి, సూపర్ హిట్ అయినప్పటికీ మరికొంత మందికి నచ్చలేదనే చెప్పాలి. ఎందుకంటే ఇటీవల కోరాలో ఈ సినిమా గూర్చి చర్చ జరుగగా, ఈ సినిమాలో మూడు ప్రధాన లోపాలను కలిగి ఉన్నట్టుగా
1. నిత్యా మీనన్ (శోభన) తనకు ప్రేమ కలిగిన వెంటనే తెలియజేసి ఉండాలని, అలా అప్పుడే చెప్పకుండా ఇరవై ఏళ్లు ఎందుకు ఎదురుచూసిందని, ధనుష్ (తిరు) తన తాత శోభన గురించి చెప్పేవరకు కూడా శోభన పై అతనికి ఏమీ అనిపించదు.
2. ఎదిగిన మనిషికి ఎదుటివారికి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో తెలియకుండా ఎలా ఉంటాడు. అది కాకుండా అతనికి ఎటువంటి ఫిలింగ్స్ లేకున్నా అతని తాత అతన్ని తప్పుదారి పట్టించాడు. ఇది కూడా అర్దం లేని విషయమే.
3.ఈ సినిమా ఒక అబ్బాయి మరియు అమ్మాయి మధ్య చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహాన్ని కూడా దిగజార్చిందని, వారు నిజంగా స్నేహితులు అయినప్పటికీ, అసంబద్ధ కారణాలతో వారిని ఒకరినొకరు ప్రేమించేలా చేసింది.
డైరెక్టర్ గారు ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ఎప్పటికీ మంచి స్నేహితుడిగా ఎందుకు ఉండలేడు. ఇది 1980ల కాలం కాదు. ప్రస్తుత ట్రెండ్ కి తగ్గ సినిమాలా లేదు. మీరు 2022లో ఉన్నారు.ప్రజల్లోకి తప్పుడు ఆలోచనలు, మూర్ఖత్వం ఇంజెక్ట్ చేయవద్దు అని అంటున్నారు.
బరువు తగ్గడం వృత్తిపరంగా అవసరం అయితే తాను బరువు తగ్గడానికి కూడా సిద్ధమేనని తెలిపారు. నేను ఖచ్చితంగా చేస్తానని తెలిపారు. నిజానికి మా పెళ్లిలో కూడా కొంత మంది దీని పై కామెంట్ చేశారు. ఇంతకు ముందు ఇలాగే ఉండేవారు. నా శరీరంతో ఇప్పుడు నేను కంఫర్టబుల్‌గా ఉన్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు బరువు తగ్గవచ్చని, ఫిట్నెస్ తో ఉన్నాను. నేను నా శరీరంతో సంతోషంగా ఉన్నాను. నేను లావుగా ఉండడం వల్ల ఇతరులకు ఎలా, ఎందుకు ఇబ్బందిగా ఉందో నాకు తెలియడం లేదు అని తెలిపింది.
నటి మంజిమా మోహన్ కొన్ని నెలలుగా షూటింగ్స్ నుండి విరామం తీసుకుంది. పెళ్లి తరువాత మీరు సినిమాల్లో నటిస్తారా అన్న ప్రశ్నకు సినిమాలు చేయడానికి సిద్ధమేనని మంచి స్టోరీ కోసం చూస్తున్నానని, త్వరలోనే కొత్త సినిమా గురించి వివరాలను తెలియచేస్తానని చెప్పారు.
ట్రోల్స్ పై మంజిమా మోహన్ స్పందించిన నేపథ్యంలో ఇప్పటి నుండి అయిన ఆమె పై సోషల్ మీడియాలో ట్రోల్స్ ఆగుతాయో చూడాలి మరి. మంజిమా మోహన్ కు తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న నటి. నాగచైతన్య తో నటించిన సాహసం శ్వాసగా సాగిపో సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
కంగనా రనౌత్ ‘చంద్రముఖి 2’లో రాజుగారి ఆస్థానంలో ఉండే ప్రసిద్ద నర్తకి పాత్రలో కనిపించనుంది. కంగనా రనౌత్ కు జంటగా తమిళ నటుడు రాఘవ లారెన్స్ నటించనున్నారు. ఇక ఈ సినిమాకి జాతీయ అవార్డు గ్రహీత కాస్ట్యూమ్ డిజైనర్ నీతా లుల్లా పని చేయనున్నారు. కంగనా ఈ పాత్రను చేయనుండడంతో ఈ సినిమా పై ఆసక్తి పెరిగింది. ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ డిసెంబర్ మొదటి వారంలో మొదలవుతుందని సమాచారం.
కంగనా రనౌత్ ఈ షెడ్యూల్ లో పాల్గొననుందని తెలుస్తోంది. కంగనా దర్శకత్వం వహిస్తున్న రెండవ సినిమా ‘ఎమర్జెన్సీ’ తరువాత షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుంటుంది. అది ముగిసిన తర్వాత ‘చంద్రముఖి 2’ సెకండ్ షెడ్యూల్ జనవరిలో మొదలవుతుంది. ఈ సినిమాను అతిపెద్ద నిర్మాణ సంస్థ అయిన లైకా నిర్మిస్తోంది. ఇక కంగనా రనౌత్ ‘తేజస్’ అనే సినిమాలో కూడా నటిస్తోంది. ఇందులో ఆమె ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ పాత్రను పోషిస్తుంది. ఆమె చేతిలో మరో ప్రాజెక్ట్ ‘నోటి బినోదిని’ కూడా ఉంది.
నయనతార ఇంట్లో ఎనిమిది మంది పనివాళ్లు పని చేస్తారు. అయితే పనిచేసేవారిలో ఒకరికి 4 లక్షల అప్పు ఉందని తెలియగానే, వెంటనే నయనతార వారికి ఉన్న 4 లక్షల రూపాయల అప్పు తీర్చేసింది. పని వారి కష్టం తెలుసుకుని, తీర్చే గొప్ప మనసు నా కోడలిదని, అంతేకాకుండా తన దగ్గర పనిచేసేవాళ్లను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. అలా చేసేందుకు పెద్ద మనసు ఉండాలి. తన కోడలు పది మంది చేసే పనిని తనొక్కతే చేయగలదు అంటూ నయనతారను పొగిడింది విగ్నేష్ తల్లి మీనా కుమారి.
అయితే విగ్నేష్ తల్లి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇటీవలే నయనతార దంపతులు సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులుగా మారారు. మరో వైపు నయనతార పెళ్లి తర్వాత కూడా సినిమాలలో అదే ఉత్సాహంతో నటిస్తోంది.ప్రస్తుతం ఆమె చేతి నిండా చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక అత్యదిక పారితోషికం తీసుకుంటున్న స్టార్ హీరోయిన్లలో ఇప్పటికీ నయనతార టాప్ ప్లేస్ లో ఉంది.