హీరో మంచు విష్ణు, పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ ల కలయికలో వచ్చిన లేటెస్ట్ కామెడీ మూవీ ‘జిన్నా’. దీపావళి కానుకగా ఈ సినిమా విడుదల చేశారు. అయితే ఈ సినిమాకి డీసెంట్ టాక్ వచ్చింది. కానీ దీపావళి పోటిలో మిగతా సినిమాలు ఉండడం వల్ల, ప్రేక్షకులు జిన్నా సినిమాను ఆదరించలేదు. దీంతో జిన్నా సినిమా బాక్సాఫీస్ నుండి ఫాస్ట్ వెళ్ళిపోయింది.
ఈ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ కూడా నిరాశ కలిగించాయి. సినిమా బడ్జెట్ ప్రకారం చూస్తే భారీ నిరాశనే మిగిల్చిచిందని చెప్పాలి. జిన్నా సినిమాకు 12.50 కోట్ల ఖర్చు చేశారని టాక్. అయితే ఇద్దరు హీరోయిన్స్ రెమ్యునరేషన్ ఎక్కువే తీసుకున్నారని, మూవీ ప్రొడక్షన్ కాస్ట్ కూడా చాలా ఎక్కువైందని, మూవీని క్వాలిటీగా తెరకెక్కించడం వల్ల బడ్జెట్ పెరిగిందని చెప్తున్నారు. అయితే బాక్సాఫీస్ కలెక్షన్స్ గురించి చెప్పాలంటే పెట్టిన బడ్జెట్ లో పది శాతం కూడా రికవరీ చేయలేదని తెలుస్తోంది.
జిన్నా సినిమా సోలోగా విడుదల చేసి ఉంటే సినిమాకి పెట్టిన బడ్జెట్ లో కొంత వరకు అయిన కలెక్షన్స్ దక్కేవి, కానీ పోటిలో విడుదల చేయడం వల్ల సినిమాకి పెద్ద దెబ్బ పడింది. జిన్నా (మంచు విష్ణు), లైఫ్ లో ఎలాంటి గోల్ లేకుండా, ఊరి నిండా అప్పులు చేసి, వాటిని తీర్చడం కోసం ఒక టెంట్ హౌస్ పెట్టుకొని, అది కూడా నష్టపోయి, ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉంటాడు. ఆ సమయంలో జిన్నా జీవితంలోకి వస్తుంది కోటీశ్వరురాలు రేణుక (సన్నీలియోన్). ఆమెను పెళ్లాడి, ఆమెకు ఉన్న కోట్ల రూపాయల ఆస్తి ద్వారా తన అప్పులన్నీ తీర్చేసుకోవాలనుకుంటాడు జిన్నా. అయితే అది ఫలిస్తుందా ?ఆమె ఎవరు అనేది ఈ సినిమా స్టోరీ.
తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో రూపొందిన ‘జిన్నా’ మూవీని ‘అవా ఎంటర్టైన్మెంట్’మరియు ’24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ’ కలిసి నిర్మించాయి. ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’ ఫేమ్ ఈషాన్ సూర్య ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. కోన వెంకట్ కథ,స్క్రీన్ప్లే అందించారు.సంగీతం అనూప్ రూబెన్స్ అందించారు.