హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ లో నటించిన సినిమా ‘మాయా పేటిక’. ఈ మూవీకి ‘థాంక్యూ బ్రదర్’ డైరెక్టర్ రమేష్ రాపర్తి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో బేబీ ఫేమ్ విరాజ్ అశ్విన్, సిమ్రత్ కౌర్, సునీల్ కీలక పాత్రలలో నటించారు.
ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన మాయా పేటిక మూవీ టీజర్ మరియు ట్రైలర్ కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. జూన్ 30న రిలీజ్ అయిన ఈ మూవీ, ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
ఆర్ఎక్స్ 100తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్, ఆ మూవీ హిట్ అవడంతో వరుస అవకాశాలను అందుకుంది. ఆమె నటించిన లేటెస్ట్ మూవీ మాయా పేటిక. ఈ మూవీ కథ విషయనికి వస్తే, తెలుగులో స్టార్ హీరోయిన్ గా పాయల్(పాయల్ రాజ్ పుత్) రాణిస్తూ ఉంటుంది. ఒక ప్రొడ్యూసర్ పాయల్ కి ఒక స్మార్ట్ ఫోన్ ని గిఫ్ట్ గా ఇస్తాడు. ఆ స్మార్ట్ ఫోన్ పాయల్ కి బాగా నచ్చుతుంది.
అయితే ఒక రోజు ఆ ఫోన్ కు ఏదో సమస్య వస్తుంది. దాంతో ఆ ఫోన్ ను ఆమె తన దగ్గర పనిచేసే అసిస్టెంట్ కి ఇస్తుంది. ఆ ఫోన్ అసిస్టెంట్ దగ్గర నుండి చాలా మంది దగ్గరకి మారుతుంటుంది. ఆ ఫోన్ ఎవరెవరి దగ్గరికి వెళ్ళింది? ఆ ఫోన్ వల్ల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనేది మిగిలిన కథ.
ఈ మూవీలో ఇంట్రెస్టింగ్ విషయం డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్. అది మాత్రమే కాకుండా పలు కామెడీ సీన్స్ ఆకట్టుకుంటాయి. ప్రధాన పాత్రలో నటించిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ మంచి నటనని కనబరిచింది. విరాజ్ అశ్విన్, సిమ్రాత్ కౌర్ లు తమ పాత్రలలో ఒదిగిపోయారు. యాక్టర్ శ్రీనివాస రెడ్డి ఎమోషనల్ సన్నివేశాలు కదిలిస్తాయి. మూవీ కాన్సెప్ట్ బాగున్నా, సరైన స్క్రిన్ ప్లే లేకపోవవడం, బాగా సాగదీసిన భావన కలుగుతుంది.
Also Read: “జూనియర్ ఎన్టీఆర్” పై నిరుత్సాహం వ్యక్తం చేస్తూ ఒక అభిమాని రాసిన లెటర్..! ఏం అన్నారంటే..?


ఈమధ్య కాలంలో మోహన్ బాబు కుటుంబం తరచూ వివాదాల్లో ఉండటం కూడా ఈ మూవీ పై ప్రభావం చూపిందని అంటున్నారు. థియేటర్లో రిలీజ్ అయ్యి డిజాస్టర్ మూవీగా నిలిచిన జిన్నా నేటి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా ఈ మూవీకి దర్శకుడు నాగేశ్వర రెడ్డి స్టోరీ అందించగా, కోన వెంకట్ స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమాలో రఘు బాబు, అన్నపూర్ణమ్మ, సీనియర్ నరేష్, వెన్నెల కిశోర్, సునీల్, చమ్మక్ చంద్ర, తదితరులు నటించారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందించారు.

అయినా పాయల్ కీ మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఈ బ్యూటీ ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా “గాలి నాగేశ్వరరావు” అనే మూవీలో నటిస్తోందని సమాచారం. ఇదిలా ఉండగా తనకు అవకాశం వచ్చినప్పుడల్లా పాయల్ రాజ్ పుత్ తన అందాలను బయట పెడుతుంది.
ప్రస్తుతం ఆమె జీ మహోత్సవం కార్యక్రమంలో తన డాన్స్ పర్ఫార్మెన్స్ తో అదరగొడుతోంది. తన ప్రియుడు సౌరబ్ దింగ్రతో కలిసి ఒక రొమాంటిక్ పర్ఫార్మెన్స్ ని ఇచ్చింది. అయితే ఎపిసోడ్ మాత్రం ఈ రోజు ప్రసారం కానుంది. తాజాగా దీని ఫ్రొమో బయటకు విడుదల చేశారు. 
