డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇప్పుడిపుడే ‘లైగర్’ సినిమా అపజయం నుండి బయటపడుతున్నాడు. ఇక ఈ క్రమంలోనే తరువాతి ప్రాజెక్ట్ పై పనిచేస్తున్నాడు. అయితే పూరీ జగన్నాథ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ తో స్టోరీని రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ స్టోరీని మెగాస్టార్ కి చెప్పగా, చిరంజీవి ఒకే చేశాడని సమాచారం.
హీరో క్యారెక్టరైజేషన్ పై స్టోరీ చేయగల సత్తా ఉన్న డైరెక్టర్ ఎవరంటే టక్కున వచ్చే సమాధానం పూరీ జగన్నాథ్. ఎందుకంటే ఆయన మూవీస్ లోని హీరోలు రాముడు మంచి బాలుడు అనేలా ఉండవు. పూరీ అల్లర చిల్లరగా తిరుగే హీరోలకు సమాజం పట్ల కొంచెం ప్రేమ, బాధ్యత ఉన్నట్టుగా చూపిస్తాడు. ఈ క్రమంలోనే పూరీ జగన్నాథ్ తన మూవీస్ ద్వారా చాలా యాక్టర్స్ కి స్టార్డమ్ ని అందించాడు. కెరీర్ మొదట్లో ప్రేమ కథలు చేసిన పూరీ జగన్నాథ్, ఆ తర్వాత గ్యాంగ్స్టర్, మాఫియా కథలతో స్టార్ హీరోలకు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చాడుకానీ పూరీ జగన్నాథ్ కి తన కెరీర్లో మెగాస్టార్ చిరంజీవితో మూవీ చేసే ఛాన్స్ మాత్రం రాలేదు. అప్పట్లో ఒకసారి ‘ఆటో జానీ’ అంటూ వార్తలు వచ్చినా, ఆ తరువాత అది అక్కడే ఆగిపోయింది. మెగాస్టార్ రీఎంట్రీ తరువాత వరుసగా సినిమాలు చేస్తున్నాడు. కొత్త దర్శకులకు కూడా అవకాశాలిస్తున్నాడు. అయితే ఈ క్రమంలోనే రీసెంట్గా పూరీ చెప్పిన కథ నచ్చి సినిమా అంగీకరించినట్లుగా వార్తలు వస్తున్నాయి.విజయ్ దేవరకొండ, అనన్య పాండే హీరోహీరోయిన్లుగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘లైగర్’ సినిమా డిజాస్టర్ అవడంతో, పాన్ ఇండియాగా విడుదలైన ఈ సినిమా పూరీకి భారీగా నష్టాలను తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో పూరీ కెరీర్లో కోలుకోవడం చాలా కష్టం అనే మాటలు ఎక్కువ వినిపించాయి. అయితే, పూరీ జగన్నాథ్ కి ఇలాంటి అప్ అండ్ డౌన్స్ మామూలే. తన స్కిల్నే నమ్ముకుని పూరీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు ప్రయత్నాలు స్టార్ట్ చేసాడు.
ఈ సమయంలోనే పూరీ జగన్నాథ్ చెప్పిన కథకు మెగాస్టార్ ఇంప్రెస్ అయ్యి, స్క్రిప్ట్ ను పూర్తిగా డెవలప్ చేయమని చెప్పాడని ఫిల్మ్ సర్కిల్ లో టాక్ నడుస్తోంది.కొంతమంది బాలకృష్ణ తీసిన పైసా వసూల్ సినిమా అసలు చిరంజీవితో చేయాల్సిన సినిమా అని అంటున్నారు. కానీ ఏదేమైనా సరే ఇప్పుడు పూరి చిరంజీవి కోసం ఒక కొత్త కథ రాసుకున్నారు. ఆ కథ కూడా ఇటీవల పూరి దర్శకత్వంలో వచ్చిన సినిమాలతో పోలిక లేకుండా ఉంటుంది అని అంటున్నారు.
ఇది ఒక గ్యాంగ్స్టర్ డ్రామా అయ్యే అవకాశాలు ఉన్నాయి అనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఇందులో చిరంజీవి డాన్ రోల్ లో కనిపిస్తారా? లేక అందుకు వ్యతిరేకంగా వారు చేసే పనులని ఆపే వ్యక్తి లాగా కనిపిస్తారా అనేది మాత్రం ఇంకా తెలియదు. ఒక వేళ చిరంజీవి డాన్ రోల్ లో కనిపిస్తే సినిమా మామూలుగా ఉండదు అని అంటున్నారు. ప్రస్తుతానికి అయితే వీరి సినిమా గురించి ఈ వార్త మాత్రం ప్రచారం అవుతోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటించే అంతవరకు ఆగాల్సిందే.