బాహుబలితో ఇటు టాలీవుడ్ నే కాదు అటు బాలీవుడ్,కోలీవుడ్ లని సైతం తన సత్తా ఏంటో చూపించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.సాహూ సినిమాతో ఇక్కడ నిరాశ పరిచిన బాలీవుడ్ లో తన మార్కెట్ ను ఖాన్లకి సైతం తీసిపోనట్టుగా తన సత్తా ని చాటుకున్నాడు.ప్రభాస్ ఇప్పుడు టాలీవుడ్ లో మాత్రమే టాప్ స్టార్ కాదు,ఫ్యాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగిపోయారు.
ఇకపోతే ప్రభాస్ తన తదుపరి సినిమా ‘రాధే శ్యామ్’ దాదాపుగా పూర్తి అయిపోయింది.ఈ సినిమా పై అంచనాలు కూడా తార స్థాయిలోనే ఉన్నాయి.ఈ సినిమా విడుదలకి సన్నాహాలు అవుతుండగానే ప్రశాంత్ నీల్ తో సలార్ ని తెరకెక్కిస్తున్నాడు.మరో సినిమా మహానటి దర్శకుడితో మరో భారీ ప్రాజెక్ట్ కూడా సిద్ధంగా ఉంది.సెలెబ్రెటీలు ఏమి చేసిన ఒక ల్యాండ్ మార్క్ లాగా ఉంటుంది వారి లైఫ్ స్టైల్ ఆలా ప్రభాస్ కి కార్ల మీద మక్కువ కాస్త ఎక్కవే..ఇప్పటికే ప్రభాస్ దగగ్ర కార్ల కలెక్షన్ చాలానే ఉంది, బీఎమ్‌డబ్ల్యూ 520D, ఇన్నోవా క్రిస్టా, జగువార్ ఎక్స్‌జేఎల్, రేంజ్ రోవర్ వోగ్, రోల్స్ రాయ్స్ గోస్ట్ కార్లు వంటి కార్లు కు తోడుగా రేసెంట్ గా మరో కార్ కొన్నారు ప్రభాస్.అది కూడా ఈ ఆదివారమే డెలివరీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.రెబెల్ స్టార్ కు లంబోర్గిని అవెంటాడర్ ఎస్ రోడ్‌స్టర్ కారును డెలివరీ చేయడం ద్వారా కేవలం ఇది రెండో కార్ మాత్రమే అని ఆ కంపెనీ ఒక ప్రకటనలో చెప్పింది ఈ కారు ధర అక్షరాలా 5 నుంచి 6కోట్ల వరకు ఉంటుంది.
Also check : మెగాస్టార్ కొత్త చిత్రానికి టైటిల్ ఏంటో తెలుసా ?