కన్నడ స్టార్ హీరో యష్ కేజిఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా హీరో అయిపోయారు. కే జి ఎఫ్ సిరీస్ ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలోనే పెద్ద హిట్ గా నిలిచింది. డైరెక్టర్ ప్రశాంత్ నీళ్ళు టేకింగ్ కి ఎలివేషన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. రాఖీ బైక్ క్యారెక్టర్ లో యష్ నటన కట్టిపడేస్తుంది. ఒక్క సినిమా తోటే దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ని సంపాదించి ఉన్నారు యష్.
అయితే కేజిఎఫ్ చాప్టర్ 2 చిత్రం రిలీజ్ అయ్యి సంవత్సరం పైనే అయినా కూడా ఇప్పటికీ యష్ తన నెక్స్ట్ సినిమాని ప్రకటించలేదు. కేజిఎఫ్ చాప్టర్ 2 ఎండింగ్ లో కేజిఎఫ్ చాప్టర్ 3 ఉంటుందని ప్రకటించిన కూడా అది ఎప్పుడు ఉంటుందని దానిపైన క్లారిటీ లేదు.

అయితే కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తన నెక్స్ట్ సినిమా సలార్ షూటింగ్ లో బిజీ అయిపోయారు. యష్ మాత్రం ఇప్పటికీ ఎటువంటి క్లారిటీ ఇవ్వకుండా తన ఫాన్స్ నిరాశలో ముంచేశారు. అయితే తొందరలో యష్ ఫ్యాన్స్ నిరాశకి తెరపడనుంది. యష్ 19 అప్డేట్ వచ్చేస్తుందంటూ ఇప్పుడు తాజా సమాచారం అందింది. నవంబర్ ఒకటో తారీఖున ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన రాబోతుంది. డిసెంబర్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది అని టాక్. శ్రీలంకలో 45 రోజులపాటు సింగిల్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట.

ఈ మూవీ షూట్ 90% శ్రీలంకలో 10% బెంగళూరులో నిర్వహించనుండగా ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు కూడా షురూ అయినట్టు ఇన్ సైడ్ టాక్.ఈ ఏడాది జూలైలో మలేషియాలో జరిగిన ఈవెంట్లో యష్ 19 మూవీ గురించి హీరో యష్ మాట్లాడుతూ… నేను కొత్త ప్రాజెక్టు కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నా. ఈ సినిమా భారీ స్థాయిలో ఉంటుందని చెప్పను కానీ ఒక మంచి మూవీ. ఈ సినిమాని త్వరలోనే ప్రకటిస్తాను ఓపిక పట్టండి. నన్ను నమ్మండి మీ అంచనాలకు తగ్గకుండా అదిరిపోయే కిక్కిచ్చేలా సినిమా ఉంటుందని ప్రకటించారు.

పాపులర్ కన్నడ చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎస్ ప్రొడక్షన్ ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. మరి ఈ సినిమాను నిర్మించేది ఎవరు? దర్శకుడు ఎవరు?పూర్తి వివరాలు త్వరలోనే తెలియనుంది.అయితే కేజిఎఫ్ సిరీస్ చూసిన ఫాన్స్ అయితే మాత్రం దానికి మించిన మూవీ కావాలంటూ యష్ పై ఒత్తిడి చేస్తున్నారు. కేజిఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత మళ్లీ అలాంటి రేంజ్ ఉన్న సినిమాను ఆడియన్స్ కి అందించాలంటే ఏ హీరో అయినా కూడా కాస్త కష్టపడాల్సిందే. మంచి కథను ఎంచుకోవాల్సిందే. ప్రస్తుతం యష్ అదే చేస్తున్నాడు.
Also Read:యాత్ర-2” సినిమాలో చంద్రబాబు నాయుడు పాత్రలో నటించబోతున్న… ఆ యాక్టర్ ఎవరో తెలుసా..?

కాగా ఇటీవల ఆర్ ఆర్ ఆర్ జపాన్ లో రిలీజ్ అయ్యి, అక్కడ భారీ వసూళ్లు రాబడుతోంది. జపాన్ లో RRR సినిమా రాబడుతున్న కలెక్షన్స్ తో లెక్కలు మొత్తం మారిపోయాయి. ఈ సంవత్సరంలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా టాప్ ప్లేస్ లో ఆర్ ఆర్ ఆర్ నిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక జపాన్ లో RRR రిలీజ్ కు ముందు వరకు కేజీఎఫ్ 2 సినిమానే 2022లో అత్యధిక వసూళ్లు నమోదు చేసిన సినిమాగా ఉంది.
కానీ ఇప్పుడు జపాన్ ప్రేక్షకుల వల్ల రాజమౌళి సినిమాకి ఆ రికార్డు దక్కింది. అయితే ఇప్పటి వరకు ఆర్ ఆర్ ఆర్ మూవీ 1200 కోట్ల కలెక్షన్స్ తెచ్చిందని తెలుస్తోంది. కాగా కేజీఎఫ్ 2 సినిమా 1200 కోట్లకు దగ్గరగా ఉన్నట్లు సమాచారం. అయితే కొంచెం తేడాతోనే ఆర్ ఆర్ ఆర్ టాప్ ప్లేస్ ను దక్కించుకుంది.ఇక కేజీఎఫ్ 2 సినిమా రెండవ స్థానంలో ఉంది.
కన్నడ చిత్రాలు పాన్ ఇండియా వైడ్ గా విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నాయి. ‘కేజీయఫ్’తో రాకీభాయ్ దేశాన్నిషేక్ చేశాడు.‘కేజీయఫ్’ హిట్ ఒక ఎత్తైతే, ఆ తరువాత వచ్చిన ‘కేజీయఫ్ 2’ మరో లెవెల్. ఇక దీంతో కన్నడ సినీ పరిశ్రమ వెలిగిపోతోంది. అయితే తాజాగా ‘కేజీయఫ్’ రికార్డు ను కాంతార దాటేసింది. అయితే ఇక్కడ ఒక సందేహం రాకమానదు. ఎందుకంటే ‘కేజీయఫ్ 2’మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 1250 కోట్లు సాధించింది. అయితే ఇక్కడ చెప్పేది కర్ణాటక రాష్ట్రంలోని కలెక్షన్స్ గురించి మాత్రమే.‘కేజీయఫ్ 2’మూవీ రూ.172 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా వసూలు చేసింది.
తాజాగా ఆ కలెక్షన్స్ ను ‘కాంతార’ 60 రోజుల్లోనే క్రాస్ దాటేసిందట. ఇక దీంతో కన్నడ ఇండస్ట్రీలో ‘కాంతార’ మూవీనే టాప్. అయితే రెండు సినిమాలకు మధ్య చాలా తేడాలు ఉన్నాయి. కేజీయఫ్ 2 బడ్జెట్ రూ. వందల కోట్లలో ఉంటే, ‘కాంతార’ బడ్జెట్ రూ.16కోట్లు. కథనే నమ్ముకుని ‘కాంతార’ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ రెండు సినిమాలను నిర్మించింది హోంబలే ఫిల్మ్స్.





