కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి .. ఎందుకు ఇప్పుడు ఇలా స్పెసిఫిక్ గా చెప్తున్నామంటే , తెలంగాణా ముఖ్యమంత్రి అయినప్పటికి ఆంధ్రా ప్రజలు కూడా మా ముఖ్యమంత్రి కెసిఆరే అనుకుంటున్నారు కాబట్టి. అలా తమ మనిషిగా ఓన్ చేసుకోవడంలో కెసిఆర్ గొప్పతనం లేకపోలేదు. శతృవు నోటోతోనే మంచోడు అనిపించుకోవడంలో ఉన్న కిక్కే వేరు. రాష్ట్రాన్ని విడదీసాడు అని తిట్టిన వారే ఇలాంటి ముఖ్యమంత్రే మాకు కావాలి అని పొగుడుతున్నారంటే దానికి నిదర్శనం కెసిఆర్ పనితీరే.
అవును కరోనా భయభ్రాంతులకి గురి చేస్తుంటే భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి చేయనివిధంగా పని చేస్తున్నది కెసిఆరే , అన్ని రకాల జాగ్రత్తలు తీస్కుంటూ, ప్రజలని అనునిత్యం అలర్ట్ చేస్తూ , ముందుగానే ప్రిపేర్ చేస్తూ ముఖ్యమంత్రి గా కాకుండా ఒక ఇంటి పెద్దగా కెసిఆర్ వ్యవహరిస్తున్న తీరు అద్భుతం , కెసిఆర్ ప్రెస్మీట్ అనగానే కేవలం మీడియా మాత్రమే కాదు యావత్ రాష్ట్రం ఎదురు చూస్తున్నది అంటే అది కేవలం కెసిఆర్ మాటల మాయజాలం. భయంతో బెంబేలెత్తిపోతున్న ప్రజలకు కెసిఆర్ మాటలే పెద్ద ఊరట, ధైర్యం .
ఇటీవల కాలంలో కెసిఆర్ ప్రెస్మీట్లో రిపోర్టర్స్ అడిగే క్వశ్చన్స్ కి తను వేస్తున్న పంచ్ లు మామూలుగా ఉండట్లేదు. తను ముందు నుండి అంతే అయినప్పటికి ఈ మధ్య కాలంలో తన పంచ్ లకు అందరూ ఫుల్ ఫిదా అయిపోతున్నారు. అంతేకాదు ఏకంగా ఆ వాయిస్ తో టిక్ టాక్ వీడియోలు కూడా చేస్తున్నారు. ఇన్ని రోజులు న్యూస్ ఛానెల్ చూస్తూ రిపోర్టర్స్ అడిగే సిల్లి క్వశ్చన్స్ కి తిట్టుకుని ఉంటారు కదా..అలా అడిగిన సిల్లి క్వశ్చన్స్ కి కెసిఆర్ వేసిన పంచులు ఎలా ఉన్నాయో ఒక లుక్ వేయండి.
1.యాన్యువల్ ఎగ్జామ్స్ పరిస్థితి ఏంటి సార్ అని ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు మనుషులే చచ్చిపోతుంటే పరీక్షలేందివయా అంటూ సమాధానం ఇచ్చారు కెసిఆర్. అంతేకదా ఇక్కడ ఎవడు బతుకుతడో , ఎవడు చస్తాడో అని జీవితాన్నే పరీక్షగా ఎదుర్కొంటుంటే పరీక్షలకి ఇప్పుడు తప్పిపోతుందా?
2.లాక్ డౌన్ నేపధ్యంలో రోడ్లపై మనుషులు తిరగట్లేదు కదా, అదే విషయం గురించి సోషల్ మీడియలో వైరలవుతున్న ఒక జోక్ ని ప్రస్తావించారు కెసిఆర్. ఆ జోక్ ఏంటంటే జనరల్ గా వీధి కుక్కలని బల్దియా(మున్సిపాలిటి) వాళ్లు తీస్కెళ్తుంటారు కదా.. ఈ సారి కుక్కలు మాట్లాడుకుంటున్నయట “ ఏమైంది మనుషులు కనిపిస్తలేరు, మున్సిపాలిటివాళ్లు పట్టుకెళ్లారా” అని.
Also Read >>>అతను తన భార్యని 10 రకాలుగా ఎలా ఆటపట్టించాడో తెలుసా? చూస్తే నవ్వాపుకోలేరు!
3.వలస కార్మికులని కూడా పస్తు పడుకోనివ్వం అని ప్రకటించారు కెసిఆర్ ఒక ప్రెస్మీట్లో .ఇంటింటికి రైస్ ఇస్తూ, 1500రూ చొప్పున ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అవి సరిపోతాయా అంటూ ఒక రిపోర్టర్ అడిగిన క్వశ్చన్ కి లక్షాయాభైవేలు ఇవ్వమంటావా? ఏం ప్రశ్నవయ్యా అంటూ చురకేసారు.
https://youtu.be/gL94_jbJUzs
4.ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా పాజిటివ్ వ్యక్తులకి ట్రీట్మెంట్ జరుగుతున్నది గాంధిలో అని అందరికి తెలిసిందే, ఇదే విషయంపై ఒక రిపోర్టర్ క్వశ్చన్ చేస్తే “గాంధోలో పెట్టకపోతే ఆకాశంలో పెట్టాలా ?” అంటూ పంచ్ వేశారు.
Also Read >>>లాక్ డౌన్ లో పనిచేస్తున్న ఈ 10 డిపార్టుమెంట్స్ వారికి మనం థాంక్స్ చెప్పుకోవాలి
https://youtu.be/Vtn0NTq5wr8
5.ఈ నెల పద్నాలుగుతో లాక్ డౌన్ ముగిసిపోతుంది అని అందరూ అనుకుంటున్నారు, కాని జూన్ 3వరకు పెడితే బాగుంటుంది అని ప్రధాన మంత్రితో అన్నాను అని మాత్రమే కెసిఆర్ అన్నారు..ఆ ప్రెస్మీట్ కొనసాగుతుండగానే జూన్ 3వరకు లాక్ డౌన్ పొడిగింపు అంటూ వార్త రాసేశారు.అదే ప్రస్తావిస్తూ నేనేమన్నాను ఈ సన్నాసి ఏం రాసాడో చూడండి, ఫేక్ న్యూస్ రాసింది ఎవరు?ఈ ఫేక్ న్యూస్ రాసేవాళ్లందరికి కరోనా వచ్చిపోవాలి అంటూ చురకేశారు.. ఆ ప్రెస్మీట్ జరుగుతుండగానే ఆ న్యూస్ రావడం మీడియా ఎంత ఫాస్ట్ గా న్యూస్ ఇవ్వాలి అని ఆలోచిస్తుంది తప్ప అందులో నిజం ఉందా లేదా అనేది ఆలోచించదని అర్దమైపోతుంది.
6.విదేశాల నుండి వచ్చిన వారి గురించి రిపోర్టర్ అడిగిన క్వశ్చన్ కి ఏం చేద్దామంటావో నువ్వే చెప్పు అంటూ రివర్స్ క్వశ్చన్ చేశారు. విదేశాల నుండి వచ్చే వారి గురించి అసలు ఎందుకు యాక్సెప్ట్ చేయాల్సొచ్చిందో వివరించారు.
Also Read >>ప్లీజ్…నా బాయ్ ఫ్రెండ్ ని కలవాలి…అనుమతించండి అంటూ పోలీస్ స్టేషన్ లో యువతి హల్చల్.!