వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువయిందా? అయితే ఇంట్లో ఉండే కాఫీ పొడితో ఈ ట్రిక్స్ పాటించి చూడండి!

వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువయిందా? అయితే ఇంట్లో ఉండే కాఫీ పొడితో ఈ ట్రిక్స్ పాటించి చూడండి!

by Anudeep

Ads

వానాకాలం వస్తే చిరు జల్లులు కురిసి ప్రాణం కుదుటపడిందని అందరం అనుకుంటాం. అంత వరకు బాగానే ఉంటుంది. కానీ.. వరుస పెట్టి కుండపోత వర్షాలు కురుస్తుంటేనే అసలు చిక్కులు మొదలవుతాయి. వాతావరణం లో మార్పులు చోటు చేసుకుంటాయి. ఫలితం గా పలు అనారోగ్యాలు కూడా ఎదురవుతూ ఉంటాయి.

Video Advertisement

ఈ సీజన్ లోనే ఎక్కువ గా జ్వరాలు, ఇన్ఫెక్షన్లు రావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే కొన్ని చిన్నపాటి జాగ్రత్తలను తీసుకోవడం ద్వారా ఈ వ్యాధులను ఎదుర్కోవచ్చు.

mosquito

ఈ కాలంలో ఎదురయ్యే సమస్యలలో ముఖ్యమైనది దోమలు. వానలు పడిన తరువాత దోమలు ఎక్కువగా వస్తుండడం చూస్తూనే ఉంటాం. పరిసరాలలో ఎక్కడైనా నీరు నిలిచి ఉంటె చాలు ఈ దోమలు ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొస్తుంటాయి. అయితే.. ఈ దోమల వలన చికున్ గున్యా, మలేరియా, డెంగీ వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇంట్లో ఉండే దోమలను తరిమికొట్టాలి. అందుకోసం.. ఇంట్లో ఉండే కాఫీ పొడితో ఈ సింపుల్ చిట్కా పాటించి చూడండి.

mosquito 1

ఒక బౌల్ లో నిప్పులు తీసుకోండి. అవి మండుతుండగా.. పైన రెండు టేబుల్ స్పూన్ల కాఫీ పొడిని చల్లండి. ఆ పొడి చల్లగా ఒక రకమైన పొగ వస్తుంది. ఈ వాసన దోమలకి పడదు. ఈ వాసనకి ఇంట్లో ఉన్న దోమలు దూరంగా వెళ్లిపోతాయి. దోమలు మాత్రమే కాకుండా చిన్న చిన్న పురుగులు ఏమైనా ఉన్నా అవి కూడా దూరంగా పోతాయి. వేపనూనె, కొబ్బరి నూనె కలగలిపి చేతులు, కాళ్లకు రాసుకుంటే.. దోమలు మీ దరిని చేరవు. ఈ సీజన్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.


End of Article

You may also like