షూ వేసుకుని బైక్ నడుపుతున్నారా..? అయితే ఈ విషయంలో జాగ్రత్త..!

షూ వేసుకుని బైక్ నడుపుతున్నారా..? అయితే ఈ విషయంలో జాగ్రత్త..!

by Anudeep

Ads

మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి అంటే ముందు బైక్ లేదా స్కూటర్ తీస్తాం.. రెగ్యులర్ ఆఫీస్ లు, స్కూల్స్, కాలేజెస్ కి వెళ్లే వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఉపయోగించినా చాలా మంది బైక్స్ నే వాడతారు. కార్ కంటే చాలా మంది బైక్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఎంత ట్రాఫిక్ లో అయినా.. బైక్ పై అయితే సులభంగా వెళ్ళిపోతూ ఉండవచ్చు. అయితే బైక్ నడిపేటప్పుడు మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

Video Advertisement

హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ రూల్స్ ని పాటించడంతో పాటు ప్రతి ఒక్కరు జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉంది. అదేంటంటే మీరు వేసుకునే షూ.

shoe lace 2

షూ వేసుకోవడానికి, బైక్ నడపడానికి సంబంధం ఏంటా అని ఆలోచిస్తున్నారా..? అయితే మీరు ఈ ఆర్టికల్ కచ్చితంగా చదవాల్సిందే. ఇటీవల ఫ్యాషన్ పోకడలు ఎక్కువగా ఉంటున్నాయి. భిన్న రకాల షూస్ ను వేసుకోవడానికి యువతరం సైతం ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే.. వీటితో కూడా చిక్కులు ఉన్నాయండోయ్.

shoe lace 1

అవేంటంటే.. అస్తమానం చిక్కులు పడే షూ లేస్. అవును.. మీకెప్పుడైనా ఈ ఇబ్బంది ఎదురైందా..? షూస్ కి ఉండే లేస్ ఒక్కోసారి ఊడిపోతూ ఉంటాయి. లేదా ఆ షూ లేస్ బైక్ గేర్ రాడ్ కి తగిలి చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుంది. ఇవి అలా చిక్కుకున్నప్పుడు సడన్ గా బైక్ ని ఆపాల్సి వచ్చినప్పుడు మన షూ లేస్ పట్టుకుని ఉండడం వాళ్ళ కాలిని కిందక దించలేకపోతాము. అలాంటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అందుకే.. లేస్ ఉన్న షూస్ ని వేసుకుని బైక్ నడిపేవారు ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి.


End of Article

You may also like