Ads
స్మార్ట్ ఫోన్ లు లేని వ్యక్తులు ఇప్పుడు ఎవరు లేరు అనుకుంట. అంతలా స్మార్ట్ ఫోన్ మన నిత్య జీవితంలో భాగమైపోయింది. ఎక్కడకు వెళ్లినా, ఏ పని చేస్తున్నా చేతిలో ఫోన్ మాత్రం ఉండాల్సిందే. చివరకు భోజనం చేస్తున్న టైంలో కూడా చాలా మంది ఫోన్ చూస్తూనే భోజనం చేస్తూ ఉంటారు. ఇక వాష్ రూమ్ కు వెళ్తూ ఫోన్ ను తీసుకుని వెళ్లేవారి సంగతి సరే సరి.
Video Advertisement
అయితే.. టాయిలెట్ కి వెళ్తూ ఫోన్ ను తీసుకెళ్లడం వలన చాలా ఇబ్బందులు ఎదురవుతాయట. అవేంటో ఇప్పుడు ఓ లుక్ వేద్దాం.
బాక్టీరియా, వైరస్ లు:
మనం ఫోన్ ను బాత్ రూమ్ లోకి తీసుకెళ్లి.. తిరిగి బయటకు వచ్చేటప్పుడు ఫోన్ ని మాత్రం వాష్ చేయలేము. దాని వలన ఫోన్ కు అంటుకుని ఉన్న సూక్ష్మ జీవులు మనకు ఇబ్బందులను కలిగిస్తాయి.
వ్యాధి:
సాధారణం గా ఫోన్ తీసుకెళ్లకుండా వాష్ రూమ్ వెళ్ళినప్పుడు, ఫోన్ తీసుకుని వాష్ రూమ్ కి వెళ్ళినప్పుడు ఒక తేడా ఉంటుంది. ఫోన్ తీసుకెళ్లినప్పుడు మనం అవసరమైన సమయం కంటే ఎక్కువ సేపు వాష్ రూమ్ లోనే గడుపుతాము. ఫలితంగా, పురుష నాళంపైన ఎక్కువ ఒత్తిడి పడుతుంది. దీని వలన మూల శంఖ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది.
ఇతర సమస్యలు:
ఈ పురుష నాళంపై పడే ఎక్కువ ఒత్తిడి కారణంగా ఇతర జీర్ణశయాంతర సమస్యలు వస్తుంటాయి. ఒకవేళ ఆ సమస్యలు ఇది వరకే వచ్చి ఉంటె.. మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది.
టైం వేస్ట్:
స్మార్ట్ ఫోన్ కారణంగా మీరు ఎక్కువ సేపు గడుపుతుంటారు. మీకు తెలియకుండానే మీరు మీ సమయాన్ని వృధా చేసుకుంటారు. చివరకు అదొక వ్యసనంగా తయారవుతుంది.
చివరగా.. చాలా మంది ఫోన్ ను పాడుచేసుకునేది టాయిలెట్ లోనే. పది నిమిషాల భాగ్యం కోసం.. బంగారం లాంటి ఫోన్ ను పాడు చేసుకోవడం ఎంత వరకు కరెక్ట్..? అన్నది అందరు ఆలోచించాల్సిన విషయం.
End of Article