Home Filmy AddaOTT Releases ఈ వారం OTT లో రిలీజ్ అవుతున్న 16 సినిమాలు..! ఏ సినిమా / సిరీస్ ఎందులో స్ట్రీమ్ అవుతుంది అంటే..?

ఈ వారం OTT లో రిలీజ్ అవుతున్న 16 సినిమాలు..! ఏ సినిమా / సిరీస్ ఎందులో స్ట్రీమ్ అవుతుంది అంటే..?

by Anudeep

కొన్ని సినిమాలను థియేటర్ లో చూస్తే ఆ కిక్ వేరు. కానీ కొన్ని కారణాల వల్ల మనం అన్ని సినిమాలని హాల్లో చూడలేం. అలాంటి వారికి వరం లా మారాయి ఓటీటీలు. కరోనా కాలం నుంచి ఓటీటీల ప్రాభవం ఇంకా పెరిగింది. వీక్షకులను ఆకట్టుకోడానికి అన్ని ఓటీటీ లు ప్రతి వారం ఆసక్తికరమైన కంటెంట్ ని రిలీజ్ చేస్తున్నాయి. ఇక ఈ వారం వస్తున్న సినిమాలు.. సిరీస్ లు ఏవో చూద్దాం..

#1 జీ 5

  • వేద

కన్నడ అగ్ర హీరో శివరాజ్ కుమార్ నటించిన 125వ సినిమా వేద. రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీకి హరి దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 10న శివరాజ్ కుమార్ వేద చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నారు.

OTT releases of this weekend..

  • సలాం వెంకీ

ఈ హిందీ చిత్రం ఫిబ్రవరి 10 నుంచి స్ట్రీమ్ కానుంది.

 

#2 ఆహా

  • అన్ స్టాపబుల్

నందమూరి నటసింహం హోస్ట్ గా అదరగొడుతున్న టాక్ షో అన్ స్టాపబుల్. ఎంతో సక్సెస్ ఫుల్ గా నడిచిన అన్ స్టాపబుల్ రెండో సీజన్ నేటితో అంటే ఫిబ్రవరి 9తో ముగియనుంది. అన్ స్టాపబుల్ రెండో సీజన్ పవర్ ఫినాలే ఎపిసోడ్ ను రెండు భాగాలుగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్ ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

  • సిన్

ఈ తమిళ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 10 నుంచి స్ట్రీమ్ కానుంది.

  • హంట్

నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా హంట్. ఈ చిత్రం ఫిబ్రవరి 10 నుంచి స్ట్రీమ్ కానుంది.

OTT releases of this weekend..

 

#3 డిస్నీ + హాట్ స్టార్

  • లవ్ షాదీ డ్రామా

మొదటి సినిమాతోనే తెలుగులో సూపర్ పాపులర్ అయిన హీరోయిన్లలో హన్సిక ఒకరు. గతేడాది డిసెంబర్ 4 న సోహైల్ కతురియా అనే వ్యాపారవేత్తను పెళ్లాడి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. హన్సిక పెళ్లి వీడియో స్ట్రీమింగ్ రైట్స్ ను భారీ ధరకు చేజిక్కించుకున్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్.. “లవ్ షాదీ డ్రామా” పేరుతో ఫిబ్రవరి 10న విడుదల చేయనుంది.

OTT releases of this weekend..

  • రాజయోగం

సాయి రోనక్ హీరోగా నటించిన రాజయోగం చిత్రం ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమ్ అవుతోంది.

  • మార్వెల్ స్టూడియోస్ లెజెండ్స్

ఈ ఇంగ్లీష్ సిరీస్ సీజన్ 2 ఫిబ్రవరి 10న విడుదల కానుంది.

#4 నెట్ ఫ్లిక్స్

  • తెగింపు

అజిత్ హీరోగా నటించిన తెగింపు చిత్రం ఫిబ్రవరి 8 నుంచి స్ట్రీమ్ అవుతోంది.

OTT releases of this weekend..

  • యూ

ఈ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ నాలుగో సీజన్ మొదటి పార్ట్ (5 ఎపిసోడ్స్) నెట్ ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 9న విడుదలైంది.

  • యువర్ ప్లేస్ ఈజ్ మైన్

ఈ సిరీస్ ఫిబ్రవరి 10 నుంచి స్ట్రీమ్ కానుంది.

  • లవ్ ఈజ్ బ్లైండ్

ఈ వెబ్ సిరీస్ సీజన్ 3 ఫిబ్రవరి 10 నుంచి స్ట్రీమ్ కానుంది.

OTT releases of this weekend..

  • లవ్ టు హేట్ యు

ఈ సిరీస్ సీజన్ 1 ఫిబ్రవరి 10 నుంచి స్ట్రీమ్ కానుంది.

 

#5 అమెజాన్ ప్రైమ్

  • ఫర్జీ

ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించిన రాజ్ అండ్ డీకే ఫర్జీని డైరెక్ట్ చేశారు. ఈ వెబ్ సిరీస్ లో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రాశి ఖన్నా కూడా కీలక భూమిక పోషించనుంది.

OTT releases of this weekend..

  • హంట్

నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా హంట్. రిపబ్లిక్ డే కానుకంగా జనవరి 26న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం పదిహేను రోజుల్లోనే ఓటీటీలోకి రానుంది. ప్రయోగాత్మక కథాంశంతో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాను ఫిబ్రవరి 10న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానుంది.

#6 సోనీ లివ్

  • నిజం విత్ స్మిత

ఇండియన్ పాప్ సింగర్, నటిగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న స్మిత హోస్ట్ గా మారిన టాక్ షో “నిజం విత్ స్మిత”. ఈ టాక్ షోకి సంబంధించిన అన్ని ఎపిసోడ్స్ షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ టాక్ షోలో మొదటి గెస్టుగా మెగాస్టార్ చిరంజీవి కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 10 నుంచి ఈ టాక్ షో స్ట్రీమింగ్ కానుంది.

OTT releases of this weekend..

You may also like