Ads
టీవీలో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చాలా వస్తాయి. కానీ బుర్రకి పదును పెట్టే ప్రోగ్రామ్స్ మాత్రం చాలా తక్కువగా వస్తాయి. మీలో ఎవరు కోటీశ్వరుడు లాంటి ప్రోగ్రామ్ అందులో ఒకటి. ఈటీవీలో కూడా గతంలో అలాంటి ప్రోగ్రామ్స్ చాలా వచ్చేవి. అలా ఈటీవీలో వచ్చిన ప్రోగ్రాం ఛాంపియన్. శ్రీనివాస్ అవసరాల దీనికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కొంత మంది పిల్లలని ఈ ప్రోగ్రాంలో సెలెక్ట్ చేసి, జనరల్ నాలెడ్జ్ కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. ఈ ప్రోగ్రాంలో చాలా మంచి క్వశ్చన్స్ అడిగేవారు అని అప్పట్లో చాలా మంది పొగిడే వాళ్ళు కూడా. ఎన్నో తెలియని విషయాలని కూడా ఈ ప్రోగ్రాం ద్వారా తెలుసుకునే అవకాశం దొరికింది. పిల్లల్లో కూడా ఎంత తెలివైన వారు ఉన్నారు అనే విషయం ఈ ప్రోగ్రాం ద్వారా బయటికి వచ్చింది.
Video Advertisement
ఇలాంటి ఒక ప్రోగ్రాం తీసుకురావడం ఈటీవీ వాళ్లని అభినందించాల్సిన విషయం. ఈ ప్రోగ్రాంలో ఒక ఎపిసోడ్ లో వచ్చిన ఒక అమ్మాయి ఇటీవల తెలంగాణ గర్వించే దగ్గర స్థాయికి ఎదిగింది. ఇప్పుడు అందరూ గర్వపడేలా చేసింది. ప్రోగ్రాంలో కూడా శ్రీనివాస్ అవసరాల అడిగిన ప్రశ్నలకి తడుముకోకుండా సమాధానాలు చెప్పింది. అంత చిన్న వయసులోనే అన్ని తెలివితేటలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు సివిల్స్ లో భారతదేశవ్యాప్తంగా మూడవ ర్యాంకు సాధించింది. ఆ అమ్మాయి అనన్య రెడ్డి. ఇటీవల విడుదల చేసిన సివిల్స్ ఫలితాల్లో మహబూబ్ నగర్ కి చెందిన భారతదేశవ్యాప్తంగా మూడవ ర్యాంకు సంపాదించి, రాష్ట్రం గర్వపడేలా చేశారు.
ఎటువంటి కోచింగ్ లేకుండానే సివిల్స్ లో మూడవ ర్యాంకు సాధించారు. అది కూడా మొదటి ప్రయత్నంలోనే ఇంత పెద్ద విజయం సాధించారు అనన్య రెడ్డి. సమాజానికి సేవ చేయాలని చిన్నప్పటినుండి ఉంది అని, అందుకే సివిల్స్ చదవాలి అని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. రోజుకి 12 నుండి 14 గంటలు చదివేవారు. చదివే సమయంలో ఒత్తిడి రావడం అనేది సహజం. అలాంటివి ఎక్కువగా ఉండకుండా క్రికెట్ చూడడం, నవలలు చదవడం చేశారట అనన్య రెడ్డి. విరాట్ కోహ్లీ నుండి సమయం ప్రతికూలంగా ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాలి అనే విషయాన్ని నేర్చుకున్నాను అని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనన్యని సత్కరించారు. ఇంకా ఎంతో మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు అనన్యకి అభినందనలు తెలిపారు.
watch video :
ALSO READ : ఒకే ఒక్క తెలుగు సినిమాలో నటించిన ఈ హీరోయిన్ ఎంతలా మారిపోయిందో చూడండి.!
End of Article