బాలయ్య వ్యాఖ్యాతగా ఆహాలో అన్ స్టాపబుల్ కార్యక్రమం ప్రసారమవుతున్న విషయం మనకు తెలిసిందే. బాలయ్య హోస్ట్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ షో లో ఇప్పటికే పలువురు సెలెబ్రెటీలు గెస్టులు గా పాల్గొన్నారు. ఇప్పుడు ఈ షో సెకండ్ సీజన్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షోకు రోజూ రోజుకీ మరింత క్రేజ్ పెరుగుతుంది.

Video Advertisement

 

 

కాగా ఈ షో కి తాజాగా యంగ్ రెబెల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గెస్ట్ గా వచ్చాడు. ఈ షో లో ఆయన తన స్నేహితుడు హీరో గోపీచంద్ తో కలిసి పాల్గొన్నాడు. సాధారణం గా ప్రభాస్ ఇలాంటి టాక్ షోలకు దూరంగా ఉంటాడు. తన సినిమా ఈవెంట్లకు తప్ప వేరే వాటికీ రారు. దీంతో ప్రభాస్ అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ప్రభాస్ ఫస్ట్ సీజన్ లోనే రావాల్సింది. కానీ బిజీ షెడ్యూల్స్ కారణం గా కుదరలేదని సమాచారం.. మొత్తానికి ప్రభాస్ కి ఇప్పుడు కుదిరిందిthe heroine who is the reason for prabhas - gopichand clashes..

 

అయితే ప్రభాస్ – గోపీచంద్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఒకటి ఆహా టీం రిలీజ్ చేసారు. ఇందులో ప్రభాస్ ని పలు ప్రశ్నలు అడుగుతూ ఆట పట్టించారు హోస్ట్ బాలయ్య. ప్రభాస్ ని ఒక ఫ్రెండ్ కి ఫోన్ చేయమని బాలయ్య అడగ్గా.. ప్రభాస్ రామ్ చరణ్ కి ఫోన్ చేసినట్లు ఈ ప్రోమో లో చూపించారు. అలాగే మీ ఇద్దరికీ ఒక హీరోయిన్ విషయం లో గొడవ పడ్డారంట గా అని బాలయ్య గోపీచంద్ ని ,ప్రభాస్ ని కలిపి అడిగారు. ఆ హీరోయిన్ ఎవరు అని ప్రోమో లో చూపించలేదు.

the heroine who is the reason for prabhas - gopichand clashes..

ప్రభాస్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన వర్షం సినిమాతో గోపిచంద్ ప్రతినాయకుడిగా నటించారు. ఈ మూవీ తర్వాత కూడా వీరి ఫ్రెండ్ షిప్ కొనసాగుతోంది. అయితే ఇప్పుడు బాలయ్య ప్రశ్నతో అభిమానుల్లో చర్చ జరుగుతోంది. బాలకృష్ణ 2008వ సంవత్సరం అనేసరికి సరిగ్గా అదే టైములో… గోపీచంద్ “శౌర్యం ” సినిమా చేస్తున్నారు. ప్రభాస్ “బిల్లా” సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలలో హీరోయిన్అనుష్క. దీంతో అనుష్క కోసమే ప్రభాస్.. గోపీచంద్ మధ్య గొడవ జరిగినట్లు ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇంకా ఇదే సమయంలో అనుష్క మరియు ప్రభాస్ గురించి అనేక వార్తలు రావడం తెలిసిందే. దీంతో ఆ హీరోయిన్ కోసమే ఇద్దరు హీరోల మధ్య గొడవ అయ్యుండొచ్చని భావిస్తున్నారు.