2001 నాటి “హోటల్ మెనూ కార్డ్” చూసారా..? అప్పట్లో ధరలు ఎలా ఉన్నాయి అంటే..?

2001 నాటి “హోటల్ మెనూ కార్డ్” చూసారా..? అప్పట్లో ధరలు ఎలా ఉన్నాయి అంటే..?

by Anudeep

Ads

ప్రస్తుత కాలం లో ప్రతి ఒక్కరు కూడా ఆహారాన్ని వ్యాపారంగా చేసి అమ్ముతున్నారు. ఒక రెస్టారెంట్ కి ముగ్గురు కలిసి వెళ్లి తినాలంటే రూ. 1000కి తక్కువ కాదు. ఫుడ్ బిల్లుకు తోడుగా అదనపు ట్యాక్సులు కూడా ఉంటాయి. పాలు, గ్యాస్, ఆయిల్ ధరలు పెరగడంతో.. రెస్టారెంట్లు, కేఫ్‌లు, ఫాస్ట్ ఫుడ్ ఆపరేటర్లు కూడా ధరలను పెంచుతున్నారు. ధరల పెంపు భారాన్ని వినియోగదారులపై ప్రయోగిస్తున్నారు. కొందరికి ఇదేమంత భారం కాదు. అయితే చాలా మందికి ఇది భరించలేని ఖర్చే. అందుకే చాలా మంది ప్రజలు రెస్టారెంట్ మెనూలో తక్కువ ధర కలిగిన వంటకం కోసం చాలా సేపు వెతుక్కుంటున్నారు.

Video Advertisement

సాధారణంగా ఇంట్లో చేసిన ఫుడ్ కి రుచి,ఆరోగ్యం కూడా. కానీ ఈ మధ్య కాలంలో బయట తినడానికే అందరు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు కారణాలు లేకపోలేదు. జాబ్ టెన్షన్ వల్ల కావచ్చు, ఇతర పనుల వల్ల రెస్టారెంట్లలో తినేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. కొందరు లగ్జరీ కోసం బయటకు వెళ్లి తింటుంటారు. దీని క్యాష్ చేసుకుంటూ హోటల్స్ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా రేట్స్ పెంచేస్తున్నారు. ఈ నేపథ్యం లో ప్రస్తుతం సోషల్ మీడియాలో 2001 నాటి రెస్టారెంట్ మెనూ ఒకటి హల్‌చల్ చేస్తోంది.

the menu card from 2001 goes viral..

 

ఈ మెనూ లో అన్ని ఐటమ్స్ ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. చికెన్ బిర్యానీ కేవలం రూ.30, మటన్ బిర్యానీ రూ.32 ఉంది.అయితే, ఇప్పుడు చికెన్ బిర్యానీ ధర సుమారు రూ.200, మటన్ బిర్యానీ ధర సుమారు రూ.300 వరకు పలుకుతున్నాయి. పనీర్ బటర్ మసాలా రూ.24 మాత్రమే. ఇక ఎగ్ రోల్, చికెన్ రోల్, స్పెషల్ చికెన్ రోల్ వంటి రోల్ ఐటమ్స్ రూ.7 నుంచి రూ.24 ధరల రేంజ్ లో మాత్రమే ఉండటం గమనార్హం. ఈ మెనూ కార్డు 90ల నాటి వారిని మైమరిపించేలా చేయడంతోపాటు.. నెటిజన్లను షాక్ కు గురిచేస్తోంది.

the menu card from 2001 goes viral..

ప్రస్తుతం ఈ మెనూ ఫొటో నెటిజన్లను 20 ఏళ్ల వెనక్కి తీసుకువెళుతోంది. ప్రస్తుతం ఉన్న ధరలతో పోలిస్తే ఈ మెనూలోని ఆహార పదార్థాల ధరలు చాలా తక్కువగా ఉన్నాయి.ఈ మెనూ ఇన్‌స్టాగ్రామ్‌లో కొద్ది గంటల క్రితమే షేర్ కాగా దీనికి ఇప్పటికే 3500కి పైగా లైక్‌లు వచ్చాయి. దీనిని చూసి.. అప్పటి రోజులు మళ్లీ వస్తే బాగుండు అంటూ ఓ నెటిజన్ వ్యాఖ్యానించగా.. మరొకరు ఇంకా ఆ రోజులు రావు.. అంటూ మరొకరు కామెంట్ చేశారు. “రూ.7 ఎగ్ రోల్ రూ.70 గా మారింది.. అసలు రూపాయలలో దొరికే పదార్థాలే లేవంటూ కామెంట్స్ చేస్తున్నారు.


End of Article

You may also like