Ads
మనం ఈ జన్మలో అనుభవించే ప్రతి కష్టసుఖాలు పూర్వజన్మ సుకృతం అని అంటూ ఉంటారు మన పెద్దలు. మనం తినే తిండి నుంచి మనం అనుభవించే జీవితానికి పూర్వజన్మ కి ముడిపడి ఉంటుంది.
Video Advertisement
ఈ విషయమే చాణిక్యనీతి లో చెప్పబడింది. మనం అనుభవించే ప్రతి కర్మఫలము పూర్వజన్మ ఆధారంగా ప్రస్తుతం మన జన్మ వీధిలో రాసి ఉంటుంది. గత జన్మలో మనం చేసిన పాపపుణ్యాల వల్లనే ఈ జన్మలో మనకి అవి సంక్రమిస్తాయి అని చెప్తారు చాణిక్యుడు.
మరి చాణిక్యనీతి ప్రకారం మనకు సంక్రమించే ఆ అయిదు వస్తువులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
#1. జీవిత భాగస్వామి :
సత్ప్రవర్తన కలిగిన జీవిత భాగస్వామి ని పొందడం అనేది మన గత జన్మ పై ఆధారపడి ఉంటుందని చాణిక్య నీతి లో చెప్పబడింది. ఎప్పుడైతే అన్ని మంచి గుణాలు కలిగిన జీవిత భాగస్వామి దొరుకుతారో, వాళ్ల దాంపత్య జీవితం ఆనందంగా జీవితాంతం సాగిపోతుంది.
#2. ఆహారం :
మనం రోజు అనేకమంది బిచ్చగాళ్లను చూస్తూనే ఉంటాం. ఒక పూట తిండి కోసం ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. మనం తినే ప్రతి మెతుకు మీద మన పేరు రాసి ఉంటుంది అని అంటారు పెద్దలు. చాణిక్య నీతి ప్రకారం సరైన సమయానికి మంచి ఆహారం పొందేవారు అదృష్టవంతులని చాణిక్యుడు చెబుతున్నారు.
#3. సక్రమమైన జీర్ణ వ్యవస్థ :
చాణిక్య నీతి ప్రకారం మంచి ఆహారం లభించడం అదృష్టానికి సంకేతము అనుకుంటే అది సరైన పద్ధతి కాదు. మంచి ఆహారము తిన్నా దాన్ని జీర్ణం చేసుకునే వ్యవస్థ సక్రమంగా ఉండాలి. అందువలన ఎంత మంచి ఆహారం తిన్నా కూడాను జీర్ణం చేసుకునే శక్తి ఉన్నవాడే అదృష్టవంతుడు.
#4. డబ్బు :
చాణిక్య నీతి ప్రకారం ఎంత ధనవంతుడు కుటుంబంలో పుట్టిన వాడు అదృష్టవంతుడు అనడం సరైన పద్ధతి కాదు. ఎందుకంటే వ్యక్తి ఎంత ధనవంతుడిగా పుట్టిన ఉన్న సంపదను సక్రమంగా వినియోగించిన వాడే అదృష్టవంతుడు. ఎప్పుడైతే తన దగ్గర ఉన్న సంపదను మంచి పనులకోసం వినియోగిస్తారో, వారికి ఈ గుణం కేవలం పూర్వజన్మ సుకృతం వల్లే ప్రాప్తిస్తుంది.
#5. దాన గుణం :
ఎంత ధనవంతులైన, అందరికీ దానం చేసే గుణం ఉండదు. మరికొందరు తనకున్న కొద్దిపాటి సంపాదనలోనే మంచి పనులకు ఉపయోగించి దానధర్మాలు చేస్తూ ఉంటారు. వారికి ఉన్న ఈ దానగుణం పూర్వజన్మ వల్లనే సంక్రమిస్తుంది అని చాణిక్య నీతి లో చెప్పబడుతుంది.
End of Article