Home Health Adda ఈ 4 ఫుడ్ ఐటమ్స్ ని “జంక్ ఫుడ్” అనుకుంటే పొరపాటే..! ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి తెలుసా.?

ఈ 4 ఫుడ్ ఐటమ్స్ ని “జంక్ ఫుడ్” అనుకుంటే పొరపాటే..! ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి తెలుసా.?

by Anudeep

మనం హెల్ది గా మన రోజుని ప్రారంభించాలంటే.. ఆరోగ్యకరమైన ఆహరం తప్పనిసరి. అయితే.. ఉదయం నిద్ర లేవడం ఏ మాత్రం ఆలస్యమైనా చాలా మంది బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేయడమో.. లేక అందుబాటులో ఉన్న ప్యాకెడ్ ఫుడ్ తినేయడమో చేస్తుంటారు. ఇది అస్సలు మంచిది కాదు. జంక్ ఫుడ్ శరీరానికి మంచిది కాదు సరే.. మనం ఏ ఆహారాన్ని జంక్ ఫుడ్ గా భావిస్తున్నామో కూడా తెలుసుకోవడం అవసరమే.

కొన్ని ఫుడ్స్ ని మనం జంక్ ఫుడ్ గా భావిస్తూ ఉంటాం. కానీ వాస్తవానికి అవి ఆరోగ్యానికి మంచివే. అవేంటో ఇప్పుడు చూద్దాం.

#1. పాప్ కార్న్:

junk food 1
ఇది ప్యాక్ చేసి అమ్ముతూ ఉంటారు. అందుకే చాలా మంది దీనిని జంక్ ఫుడ్ అని భావిస్తూ ఉంటారు. వాస్తవానికి పాప్ కార్న్ ఎంతో ఆరోగ్యకరమైన ఫుడ్. ఇది శరీరానికి ఫైబర్ అందించి జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది.

#2. డార్క్ చాక్లెట్:

junk food 2
చాలా మంది చాక్లేట్ లు తింటే లావు అవుతారు అని అంటుండడం వలన ఇది కూడా జంక్ ఫుడ్ అన్న ఫీలింగ్ కి వచ్చేసాం. కానీ డార్క్ చాక్లెట్ లో కోకోవా ఎక్కువ గా ఉంటుంది. అంతే కాదు ఈ చాకోలెట్స్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇవి గుండె పనితీరుని కూడా మెరుగుపరుస్తాయి.

#3. మద్యం:

junk food 3
మద్యపానం అనారోగ్యాన్ని కలుగ చేస్తుంది. ఐతే.. మితి మీరకుండా స్వల్ప మొత్తం లో మద్యపానం సేవించడం అనేది ఆరోగ్యానికి మంచిదే. మద్యం లో రెడ్ వైన్ చాలా మంచిది. మితం గా.. అవసరమైనంత మేర రెడ్ వైన్ ను తీసుకోవడం వలన శరీరం లో రోగ నిరోధక శక్తీ పెరుగుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెను పదిలం గా ఉంచుతాయి.

#4. పీనట్ బట్టర్:

junk food 4
ఇది పాకెట్స్ లో లభించడం వలన జంక్ ఫుడ్ అనుకుంటుంటాము. ఇది కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వేరుశనగ పప్పు నుండి దీనిని తయారు చేస్తారు. దీనివలన శరీరానికి ఫైబర్ లభిస్తుంది. ఇందులో లభించే పోషకాలు శరీరానికి మేలు చేయడమే కాక బరువు తగ్గడం లో కూడా సహాయపడతాయి.

You may also like