Ads
ఏవైనా కొత్తవి కనిపెట్టే క్రమంలో లేదా కనిపెట్టిన తర్వాత అవి ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోవడానికి ప్రయోగాలు చేస్తారు. అన్ని ప్రయోగాలు సక్సెస్ ఫుల్ అవ్వాలి అనే రూల్ లేదు. కొన్ని ప్రయోగాలు ఫలించవు. కొంతమంది శాస్త్రవేత్తలు వాళ్ళు కనిపెట్టిన వాటితో తమపైనే ప్రయోగం చేసుకున్నారు. పైన చెప్పినట్టుగా అన్ని ప్రయోగాలు సక్సెస్ ఫుల్ అవ్వకపోవచ్చు. అలా ఈ కొంతమంది శాస్త్రవేత్తలు తాము కనిపెట్టిన వాటితో తమపై చేసిన ప్రయోగాలు విఫలం అయ్యాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
#1 అలెక్సాండర్ బోగ్డనోవ్
అలెక్సాండర్ బోగ్డనోవ్ ఒక రష్యన్ సోవియట్ ఫిజీషియన్, ఇంకా రచయిత. జీవితాంతం యవ్వనంగా ఉండాలనే ఉద్దేశంతో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఎక్స్పెరిమెంట్స్ చేశారు అలెక్సాండర్ బోగ్డనోవ్. ఈ క్రమంలో దాదాపు 11 బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసుకున్నారు. ఆ తర్వాత అలెక్సాండర్ బోగ్డనోవ్ కి కంటి చూపు మెరుగుపడటంతో పాటు ఇంకొన్ని పాజిటివ్ సింప్టమ్స్ కూడా కనిపించాయట.
తర్వాత మలేరియా ఇంకా ట్యూబర్క్యులోసిస్ తో బాధపడుతున్న ఒక విద్యార్థి నుండి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసుకున్నారు అలెక్సాండర్ బోగ్డనోవ్. దాంతో అలెక్సాండర్ బోగ్డనోవ్ మరణించారు. కొంతమందేమో ఆయన చనిపోవడానికి ఇదే కారణం అంటూ ఉంటే ఇంకా కొంతమంది స్కాలర్స్ అలెక్సాండర్ బోగ్డనోవ్ ఆత్మహత్య చేసుకున్నారు అని, ఎందుకంటే చనిపోయే కొంత సమయం ముందు ఆయన ఒక పొలిటికల్ లెటర్ రాశారు అని అన్నారు.
#2 ఫ్రాంజ్ రీచెల్ట్
ఫ్రాంజ్ రీచెల్ట్ ఒక టైలర్. ఆయన ఒక వేరబుల్ పారాషూట్ ని తయారు చేశారు. అంతకుముందు ఆ పారాషూట్ పై ప్రయోగాలు చేశారు. వాటిలో ఒకటి సక్సెస్ అయింది. ఈ సారి పారాషూట్ తనే ధరించి ఎలా పని చేస్తుందో చూద్దాం అనుకున్న ఫ్రాంజ్ రీచెల్ట్ 1912 లో ఈఫిల్ టవర్ మీదకి ఎక్కి ఆ పారాషూట్ ధరించి దాని సహాయంతో దాదాపు 187 అడుగుల ఎత్తు ఉన్న ఈఫిల్ టవర్ మొదటి అంతస్తు నుండి కిందకి దూకుదాం అనుకున్నారు. కానీ ఆ పారాషూట్ పనిచేయకపోవడంతో అంత ఎత్తు నుండి కిందకు దూకిన ఫ్రాంజ్ రీచెల్ట్ మరణించారు.
#3 సిల్వెస్టర్ హెచ్. రోపర్
సిల్వెస్టర్ హెచ్. రోపర్ ఆవిరితో, గంటకు దాదాపు 40 మైళ్లు నడిచే సైకిల్ ని కనిపెట్టారు. జూన్ 1వ తేదీ 1896 లో ఆ సైకిల్ ప్రయోగిస్తున్నప్పుడు, సైకిల్ కంట్రోల్ తప్పి కింద పడ్డారు. కింద పడిన సిల్వెస్టర్ హెచ్. రోపర్ తలకి బలమైన గాయం అయ్యి మరణించారు.
#4 హెన్రీ స్మోలిన్స్కి
హెన్రీ స్మోలిన్స్కి, ఇంకా తన స్నేహితుడు హాల్ బ్లేక్ కలిసి ఫోర్డ్ పింటో ఆధారంగా AVE మిజార్ అనే ఒక ఫ్లయింగ్ కార్ రూపొందించారు. 1973 లో AVE మిజార్ ప్రయోగం చేస్తున్నప్పుడు రెక్కలు సరిగ్గా పనిచేయకపోవడంతో హెన్రీ స్మోలిన్స్కి మరణించారు.
#5 ఒట్టో లిలియన్థాల్
ఒట్టో లిలియన్థాల్ ఇంజన్ లేకుండా గాలిలో ఎగిరే రెక్కలను అంటే గ్లైడర్స్ ని తయారు చేశారు. ఒక సారి నిర్వహించిన ఎక్స్పరిమెంట్ లో విజయం సాధించారు ఒట్టో లిలియన్థాల్. రెండవ సారి నిర్వహించిన ఎక్స్పరిమెంట్ లో అదుపు తప్పి కింద పడిపోవడంతో ఒట్టో లిలియన్థాల్ కి థర్డ్ సర్వైకల్ వర్టిబ్రే ఫ్రాక్చర్ అయ్యింది. గ్లైడర్ క్రాష్ అయిన 36 గంటల తర్వాత ఆగస్టు 10, 1896లో ఒట్టో లిలియన్థాల్ మరణించారు.
#6 విలియం బుల్లక్
1863 లో విలియం బుల్లక్ ఒక వెబ్ రోటరీ ప్రెస్ తయారు చేశారు. ఏప్రిల్ 3, 1867 లో, విలియం బుల్లక్ ఫిలడెల్ఫియా పబ్లిక్ లెడ్జర్ వార్తా పత్రిక కోసం ఏర్పాటు చేస్తున్న తన కొత్త ప్రెస్ లలో ఒక దానికి అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు. పుల్లీ పైకి ఒక డ్రైవింగ్ బెల్ట్ ని తన్నడానికి ప్రయత్నించారు విలియం బుల్లక్. విలియం బుల్లక్ కాలు మిషన్ లో చిక్కుకుంది. కొద్ది రోజులకి గ్యాంగ్రేన్ (ఇన్ఫెక్షన్ ద్వారా లేదా రక్తప్రసరణ లేకపోవడం ద్వారా ఏర్పడే డెడ్ టిష్యూ) ఏర్పడింది. ఏప్రిల్ 12, 1867 న, లెగ్ ఆమ్ప్యుటేట్ ఆపరేషన్లో విలియం బుల్లక్ మరణించారు.
#7 హోరేస్ లాసన్ హన్లీ
హోరేస్ లాసన్ హన్లీ అమెరికన్ సివిల్ వార్ సమయంలో కాన్ఫెడరేట్ మెరైన్ ఇంజనీర్ గా ఉన్నారు. ఆయన ఒక సబ్ మెరైన్ ని తయారు చేశారు. అక్టోబర్ 15, 1863 లో తన బృందంతో కలిసి సబ్ మెరైన్ ని పరీక్షించడానికి బయల్దేరారు హోరేస్ లాసన్ హన్లీ. నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో ఆ సబ్ మెరైన్ సరిగా పని చేయలేదు. దాంతో తన బృందంతో పాటు హోరేస్ లాసన్ హన్లీ మరణించారు.
#8 మాక్స్ వాలియర్
మాక్స్ వాలియర్ దాదాపు 1920 సమయంలో లిక్విడ్ ఇంధనం తో నడిచే రాకెట్ ని కార్ కి కనెక్ట్ చేసి మొదటి రాకెట్ కార్ ను తయారు చేశారు. 1930 లో ఈ రాకెట్ కార్ మీద చేసిన మొదటి టెస్ట్ డ్రైవ్ సక్సెస్ ఫుల్ అయింది. అదే సంవత్సరం నిర్వహించిన మరొక డ్రైవ్ లో ఆల్కహాల్ ని ఇంధనంగా వాడారు. బెర్లిన్ లో జరిగిన ఈ ఘటనలో ఆ వాహనం పేలడంతో మాక్స్ వాలియర్ మరణించారు.
#9 మేడం క్యూరీ
రేడియో యాక్టివిటీ మీద జరిపిన పరిశోధనలో నోబెల్ బహుమతి అందుకున్న మేడమ్ క్యూరీ, పరిశోధన సమయం లో రేడియేషన్ లో ఎక్కువగా ఉండటం వల్ల జూలై 4వ తేదీ 1934లో మేడమ్ క్యూరీ మరణించారు.
#10 కారెల్ సౌసెక్
కారెల్ సౌసెక్ ఒక ప్రొఫషనల్ స్టంట్ మాన్. నయాగరా జలపాతం మీదగా వెళ్ళడానికి ఒక షాక్ అబ్సర్బెంట్ బ్యారెల్ ని కనిపెట్టారు కారెల్ సౌసెక్. ఆ ప్రయోగం విజయవంతం అయ్యింది. తర్వాత అదే స్టంట్ ఆస్ట్రోడోమ్ లో చేస్తున్నపుడు బ్యారెల్ ముందే రిలీజ్ అవ్వడంతో 180 అడుగుల ఎత్తు నుండి కిందకి పడి కారెల్ సౌసెక్ మరణించారు.
End of Article