Ads
కృష్ణద్వైపాయుడుగా పిలువబడే వాడు వ్యాసుడు. వేదాలను విభజించడం వల్ల వేద వ్యాసుడయ్యాడు. వేదాలతో పాటు మహాభారతం, మహాభాగవతంతో పాటు అష్టాదశపురాణాలను రచించాడు. విష్ణుమూర్తి అవతారమే వ్యాసభగవానుడు అని ప్రతీతి.
Video Advertisement
అయితే అయిదు వేళ సంవత్సరాలకు పూర్వం వ్యాసుడు కలియుగానికి సంబంధించిన కొన్ని విపత్కర పరిస్థితుల గురించి భాగవతం లో వివరించారు. అవి ప్రస్తుతం జరుగుతున్నాయి కూడా.. అవేంటో ఇప్పుడు చూద్దాం..
#1 స్త్రీ – పురుషుల మధ్య శారీరక ఆకర్షణ
కలియుగం లో స్త్రీ – పురుషులు కేవలం ఆకర్షణల వలలో పడి జీవిస్తారు. దీనికోసం ఎంతకైనా తెగిస్తారు. ప్రస్తుత కాలం లో మనం ఈ విషయానికి సంబంధించిన నేరాలను చూస్తున్నాం.
#2 సంపదకే విలువ
కలియుగంలో, సంపద మాత్రమే మనిషి విలువ ని నిర్ణయిస్తుంది. దాని కోసం మోసాలు చేయడానికి కూడా వెనుకాడరు. డబ్బుంటే ఆ వ్యక్తులను గొప్పవారిగా భావిస్తారు.
#3 సద్గుణాలు తగ్గిపోవడం
కలియుగం లో సత్యం, పరిశుభ్రత, సహనం, దయ, జీవితకాలం, శారీరక బలం, జ్ఞాపక శక్తి వంటి వాటి ప్రభావం రోజు రోజుకి తగ్గిపోతుంది.
#4 ఒకరి పై ఒకరికి ద్వేషం
కలియుగం లో పురుషులు కూడా ఒకరిపై ఒకరు ద్వేషాన్ని పెంచుకుంటారు. స్నేహ బంధాలను, బంధుత్వాలను మరచి ప్రాణాలు తీసేందుకు కూడా ప్రయత్నిస్తారు.
#5 గ్లోబల్ వార్మింగ్
చలి, గాలి, వేడి, వర్షం, మంచుతో ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. కలహాలు, ఆకలి, దాహం, అంతుచిక్కని వ్యాధులతో ఇబ్బంది పడతారు.
#6 తల్లిదండ్రులని పట్టించుకోరు
కలియుగం లో పిల్లలు తమ తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతలని విస్మరిస్తారు.
#7 అక్రమార్కులకు పట్టం
కలియుగం లో చట్టం, న్యాయం, అధికారం ఒకరి చేతిలోనే ఉంటాయి.
#8 కరువు
అధిక పన్నులు, కరువు వంటి వాటితో ప్రజలు ఇబ్బంది పడతారు. ఆహారం కోసం ఆకులు, వేర్లు, మాంసం, అడవి తేనె, పండ్లు, పువ్వులు, విత్తనాలను తింటారు.
#9 అవినీతి
కలియుగం లో అవినీతి పెరిగిపోవడం తో ఎవరైనా తనను తాను బలమైన వ్యక్తిగా చూపించుకుంటారో వారు రాజకీయ అధికారం పొందుతారు.
#10 మేధావులు నిరుపయోగం గా మారిపోతారు
కలియుగం లో మేధావుల ఆలోచనలకూ విలువ ఉండదు. దీంతో వారు నిరుపయోగం గా మారిపోతారు.
End of Article