Ads
భవిష్యత్తులో ఆర్థికంగా ఎదగాలని, ఉన్న సంపదను రెట్టింపు చేసుకోవచ్చని రకరకాల ఆర్థిక ప్రణాళికలు అనుసరిస్తుంటారు అందరు. దీని కోసం స్థిరాస్తులు కూడబెట్టేందుకు తమ జీవితం లో సంపాదించిన వాటినే వీటికే వెచ్చిస్తారు.. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టడానికి ప్రప్రథమంగా ప్రాధాన్యత చూపిస్తుంటారు. వీలైనన్ని ఎక్కువ స్థిరాస్తులు కూడబెట్టుకుంటే తమ బిడ్డలు భవిష్యత్తులో బాధపడకుండా ఉంటారు అనుకుంటారు కొందరు పెద్దలు.
Video Advertisement
అయితే ఆర్థిక స్థిరత్వం కోసం పెట్టుబడులు పెట్టడం కంటే ముందుగా ఆర్థిక రక్షణ పొందడం ముఖ్యమని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే భవిష్యత్‌లో అనుకోని జబ్బుల వల్ల డబ్బంతా ఆవిరైపోవచ్చు. వయసు పెరిగే కొద్దే మనకు డబ్బు అవసరం పెరుగుతుంది. ఆ సమయం లో స్థిరాస్తులు మనకు సహాయ పడవు. ఆ తర్వాత తీవ్ర ఆర్థిక చిక్కుల్లో పడొచ్చు. అందుకే వైద్య ఖర్చుల కు తగినంత డబ్బు కూడబెట్టడం లేదా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ముఖ్యం.
అంతే కాకుండా వయసులో ఉన్నప్పుడు కుటుంబం కోసం బాద్యతలు స్వీకరించిన పెద్దవారు మలి వయసుకు వచ్చేసరికి తమ ఇష్టాలు, కోరికలు తీర్చుకోవాలి అనుకుంటారు. అప్పుడు తమ బిడ్డల్ని డబ్బు కోసం అడిగితే ఈ వయసులో ఇవన్నీ అవసరమా అంటూ చులకన గా మాట్లాడటం మనం చూస్తున్నాం.. ఈ పరిస్థితులు ఎదురవకుండా ఉండాలి అంటే.. వీలైనంత ఎక్కువ లిక్విడ్ కాష్ పెద్ద వారు తమ దగ్గర ఉంచుకోవాలి. ఒకేసారి ఎక్కువ డబ్బు చేతికొచ్చిన సమయం లో వాటిని ఫిక్స్డ్ డిపోసిట్ చెయ్యడం.. లేదా స్థిరాస్తులపై ఇన్వెస్ట్ చెయ్యడం అంత మంచి విషయం కాదు. కాబట్టి మీ అవసరాలకు తగినంత డబ్బు మీ బ్యాంకు అకౌంట్ లో ఉండేలా చూసుకోవాలి.
అంతే కాకుండా ఇంట్లో మగవారు సంపాదిస్తారు..రిటైర్ అయ్యాక వారికీ పెన్షన్ వస్తుంది .. వారికి జీవితం బాగానే గడుస్తుంది. కానీ ఇంట్లో ఆడవారి పరిస్థితి ఏమిటి ..?? తండ్రి చనిపోయాక ఆస్తులు పంచుకొనే బిడ్డలు అందులో తల్లికి వాటా ఇవ్వాలి అనుకోరు. దీంతో ఆమె పరిస్థితి అగమ్యగోచరం గా మారుతుంది. వారి బాధ్యత తీసుకోవడానికే పిల్లలు ఇష్టపడని ఈ రోజుల్లో వారి ఇష్టాయిష్టాలు గురిస్తారు అనుకోవడం మన భ్రమ.
పిల్లల్ని ప్రేమతో పెంచి.. మంచి బుద్దులు నేర్పిస్తే మలి వయసులో వల్లే మనల్ని చూసుకుంటారు.. అలా కాకుండా ఎందుకు నన్ను చూడరు అన్న ధోరణిలో మీరుంటే రెంటికి చెడ్డ రేవడిలా తయారవుతుంది పరిస్థితి. అందుకే పిల్లల పెంపకాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మలి వయసు ఆర్థిక రక్షణ చేసుకోవాలి అని సూచిస్తున్నారు నిపుణులు.
End of Article