Ads
ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం ఈరోజుల్లో చాలా మాములు వ్యవహారం అయిపొయింది. పెద్దలకు ఇష్టం లేకపోయినా చాలా మంది తాము మేజర్లం అయ్యామంటూ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇక్కడ వారు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటె ఎవరికీ బాధ ఉండదు.
Video Advertisement
కానీ, పెళ్ళైన నెల రోజులకే కూలిపోయే ఈ కాపురాలు తల్లితండ్రులకు తీరని మనోవేదనని మిగులుస్తున్నాయి. మరోవైపు అమ్మాయిలను మోసం చేసే అబ్బాయిలు కూడా ఎక్కువ అవుతున్నారు.
మాయ మాటలని చెప్పి అమ్మాయిలను లోబరుచుకోవడం, తీరా మోజు తీరాక వదిలిచ్చేసుకునే క్రమంలో విడాకులు దాకా వెళ్లిపోవడం లాంటి ఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. అలాంటి ఘటనే వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం బట్టు తండా 2 వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, వరంగల్ కు చెందిన బాదావత్ అనిల్ కుమార్ అనే వ్యక్తి చౌటపల్లి శివారు లచ్చ తండాకు చెందిన స్రవంతి అనే అమ్మాయిని ప్రేమించాడు.
అందుకు ఆమె కూడా అంగీకరించడంతో వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్ళింది. ఈ ఏడాది జనవరిలోనే స్రవంతి అనిల్ ను ప్రేమ వివాహం చేసుకుంది. అయితే వీరి పెళ్లి ఎంతో కాలం నిలవలేదు. 45 రోజులు కాపురం చేసిన తరువాత అతనికి మొహం మొత్తిందో ఏమో ప్రేయసిని వద్దు అంటున్నాడు. ప్రియుడిని నమ్మి సర్వం అర్పించిన స్రవంతి ఇప్పుడు రోడ్డున పడింది. అతని ఇంటి ముందు బైఠాయించి తనకు న్యాయం చేయాలంటూ కోరుతోంది. ప్రేమించి పెళ్ళి చేసుకున్న అనిల్ కుమార్ 45 రోజులు కాపురం చేసిన తరువాత ఇప్పుడు వద్దు అంటున్నాడని స్రవంతి వాపోయింది. తనకు ఏమి చేయాలో పాలుపోవడం లేదని ఆవేదన చెందుతోంది. తన భర్త తనకి కావాలని కోరుతోంది. తాను నన్ను స్వీకరించే దాకా ధర్నా కొనసాగిస్తూనే ఉంటానని చెబుతోంది.
End of Article