Ads
డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళకి కూడా అస్సలు ఇష్టం లేనివి ఏంటి అంటే స్పీడ్ బ్రేకర్స్. మితిమీరిన వేగం ఎప్పటికైనా ప్రమాదకరమే. ఈ వేగాన్ని అదుపు చేయడం కోసమే రోడ్లపై స్పీడ్ బ్రేకర్స్ ను ఏర్పాటు చేస్తారు. కాబట్టి రోడ్డు పై వెళ్లే వాహనదారులు వాళ్ళ వెహికల్ ను కొంత స్లో చేసుకుని వెళ్లాలన్న ఉద్దేశం తో స్పీడ్ బ్రేకర్స్ ను నిర్మించడం స్టార్ట్ చేసారు.
Video Advertisement
కానీ, ఇండియా లో పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నం. మన దేశం లో కూడా రోడ్లపై స్పీడ్ బ్రేకర్స్ ను ఏర్పాటు చేస్తారు. కానీ, ఇక్కడ మాత్రం జనాలు వాటిని మధ్యలో పగలకొట్టేస్తూ ఉంటారు. సాధారణం గా స్పీడ్ బ్రేకర్స్ పైనుంచి వెళ్ళినపుడు బండి కుదుపుకు లోనవుతుంది. బండి పై కూర్చున్న వారికి కూడా ఆ కుదుపు ఇబ్బందికరం గా ఉంటుంది. అందుకే, వాటిని పగలగొట్టేసి.. మధ్యలో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు.
వాస్తవానికి స్పీడ్ బ్రేకర్స్ ను మన క్షేమం కోసమే రూపొందించారు. కానీ, మనం ఇలా నిర్లక్ష్యం గా వ్యవహరించడం మంచిది కాదు. మరో వైపు వీటివలన బండి పాడవుతుంది అని వాదించే వారు కూడా ఉన్నారు. కానీ, వేగాన్ని తగ్గించకుండా.. స్పీడ్ బ్రేకర్స్ ను పగలుకొట్టడం ఎంతవరకు సమంజసం..? ఇందులో తప్పు ఎవరిది అని కూడా మనం ఆలోచించుకోవాలి.
End of Article