Ads
ప్రస్తుతం చాలా మంది ఎదుర్కుంటున్న సమస్య అధికంగా జుట్టు రాలడం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎన్ని మంచి ఆయిల్స్ ని వాడినా జుట్టు రాలిపోతోంది అంటూ చాలా మంది తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు. ముఖ్యంగా తలస్నానం చేస్తే చాలు.. ఈ జుట్టు మరింతగా రాలిపోతూ ఉంటుంది.
Video Advertisement
జుట్టు తడిగా ఉన్నపుడు దువ్వినా సరే చాలా ఎక్కువగా జుట్టు రాలిపోతూ ఉంటుంది. అంతే కాదు ఆయిల్ రాసినప్పుడు కూడా వెంటనే జుట్టుని దువ్వితే.. మరింతగా రాలిపోతూ ఉంటుంది. దీనికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
శరీరంలో జింక్ విటమిన్ లోపం ఉంటె జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటుందట. అంతేకాదు.. చేతి వేళ్ళ గోర్లపై కూడా తెల్లని చారలు ఏర్పడుతూ ఉంటాయి. ఇలా వస్తే.. అది జింక్ లోపానికి సంకేతంగా చెప్పుకోవచ్చు. జింక్ లోపం ఉంటె బట్టతల వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే పురుషుల్లో కూడా సంతానోత్పత్తి సామర్ధ్యం తగ్గుతుంది.
ఒకవేళ ఈ లక్షణాలు మీలో కూడా కనిపిస్తూ ఉంటె.. మీరు తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించడం ముఖ్యం. ప్రస్తుతం చాలా మంది జింక్ ను సప్లిమెంట్ల రూపంలో తీసుకుంటున్నారు. లేదా ఆహరం ద్వారా అయినా జింక్ ను శరీరానికి అందించే ప్రయత్నం చేయడం ఉత్తమమైన మార్గం.
End of Article