వాకింగ్ కి వెళ్తున్నానని చెప్పి విమానం ఎక్కేసాడు.. డైరెక్ట్ గా ఉక్రెయిన్ కి వెళ్లి ఇతను చేసిన పని ఏంటంటే..?

వాకింగ్ కి వెళ్తున్నానని చెప్పి విమానం ఎక్కేసాడు.. డైరెక్ట్ గా ఉక్రెయిన్ కి వెళ్లి ఇతను చేసిన పని ఏంటంటే..?

by Anudeep

Ads

ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధ వాతావరణం ముదురుతున్న సంగతి తెలిసిందే. రష్యా దాడికి తెగబడడంతో ఉక్రెయిన్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ప్రాణాలు అరచేత పట్టుకుని అక్కడి ప్రజలు చాలా ఇబ్బందికి గురి అవుతున్నారు.

Video Advertisement

రష్యా సేన దాడికి దిగడంతో ఉక్రెయిన్ అల్లాడిపోతోంది. ఈ యుద్ధం వల్ల ఉక్రెయిన్ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రాణాలు కాపాడుకోవడం కోసం పరుగులు పెడుతున్నారు. మరోవైపు పిల్లలు ఉన్న వారి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంది. నానా తిప్పలు పడీ ప్రాణాలు కాపాడుకుంటే.. తిండి తిప్పలకి వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంది.

ఇది ఇలా ఉంటె.. బ్రిటన్ కు చెందిన ఓ వ్యక్తి ఉదయాన్నే వాకింగ్ కి వెళ్తున్నానని తన భార్యకి చెప్పి నేరుగా విమానాశ్రయానికి వెళ్ళాడు. అక్కడనుంచి పోలాండ్ విమానం ఎక్కేసి మెడికా గ్రామం సరిహద్దు ద్వారా ఉక్రెయిన్ కు వెళ్ళిపోయాడు. అంతే కాదు.. అక్కడ రష్యా సైనికులకు వ్యతిరేకంగా యుద్ధం కూడా చేస్తున్నాడు. అతను బ్రిటిష్ ఆర్మీ లోనే పని చేసి రిటైర్ ఐన సైనికుడు.

british army 1

ఉక్రెయిన్ పై రష్యా దాడికి దిగడానికి సహించలేక.. ఉక్రెయిన్ కి మద్దతుగా నిలవడం కోసం ఉక్రెయిన్ తరపున యుద్ధానికి సిద్ధం అయ్యాడు. ఇటీవల ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ తానో బ్రిటీష్ మాజీ సైనికుడినని, చాలా కాలం పాటు సైన్యంలోనే పని చేసానని చెప్పుకొచ్చారు. నా బాధ్యతలు పూర్తి చేసుకున్నా, నేను చేసిన అప్పులని తీర్చేసానని చెప్పుకొచ్చారు. అన్నిటిని నాశనం చేయాలనుకున్న కొత్త యుగం హిట్లర్ ని ఎదుర్కొంటానని, అయితే తానిక్కడకి వచ్చిన విషయం తెలుసుకుని నా భార్యకి కోపం వచ్చి ఉంటుందని.. ఇక్కడనుంచి వెళ్లలేకపోతే మాత్రం బాధపడతానని చెప్పుకొచ్చారు.


End of Article

You may also like