Ads
ఈ కొత్త జంట ఐదు నెలల క్రితం తెగ వైరల్ అయ్యారు. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరు ఇంతలా వైరల్ అవ్వడానికి కారణం వారి మధ్య ఉన్న వయసు వ్యత్యాసమే. ఈ 45 వెడ్స్ 25 స్టోరీ చాలా మందికి తెలిసినదే. వీరిద్దరూ పెళ్లి చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
Video Advertisement
తాజాగా.. ఆ వరుడు ఆత్మహత్య చేసుకోవడంతో.. ఈ కథ విషాదాంతమైంది. కర్ణాటక తుమకూరు జిల్లాలోని అక్కిమరిద్య గ్రామంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
పూర్తి వివరాలలోకి వెళితే, కర్ణాటకకు చెందిన 45 సంవత్సరాల శంకరప్పకు పెళ్లి కాలేదు. అయితే కొన్ని సంబంధాలు వచ్చినప్పటికీ ఏవీ పెళ్లి పీటల వరకు వెళ్ళలేదు. ఆ క్రమంలో ఓ సారి 25 సంవత్సరాల మేఘనను కలిసాడు. అయితే ఆమె అప్పటికే వివాహం అయ్యి, భర్తతో విడిపోయి ఉంటోంది. వారి పరిచయం ప్రేమగా మారడంతో శంకరప్ప మేఘనను 2021 లో పెళ్లి చేసుకున్నాడు.
అప్పట్లోనే వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. అయితే.. పెళ్లి జరిగిన తరువాత శంకరప్ప చాలా ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వచ్చింది. శంకరప్ప పేరు మీద ఉన్న రెండున్నర కోట్ల భూమిని అమ్మేసి బెంగుళూరుకు వెళ్లాలని మేఘన శంకరప్పపై ఒత్తిడి తెచ్చేది. కానీ, ఇందుకు శంకరప్ప తల్లి ఒప్పుకోలేదు. తల్లి మాటని కాదనలేక శంకరప్ప చాలా సతమతమయ్యాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య తరచూ గొడవలు అవుతుండేవి. ముసలి తల్లిని వదిలేసి బెంగుళూరుకు రాలేనని శంకరప్ప చెప్పినప్పటికీ మేఘన వినిపించుకోకపోవడంతో మనస్థాపం చెందిన శంకరప్ప చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
End of Article