స్మార్ట్ ఫోన్ మన జీవితాల్లోకి వచ్చిన తరువాత అనేక మార్పులు చోటు చేసుకుంటూ వచ్చాయి. ముఖ్యం గా మనకు తెలియకుండానే మన మానసిక జీవితం పై స్మార్ట్ ఫోన్ ప్రభావం చూపిస్తోంది. కొంతమంది ఈ విషయాన్నీ ముందే గ్రహించి జాగ్రత్త పడుతున్నారు. మరికొందరు ఈ విషయాన్నీ గ్రహించినా బయటపడలేకపోతున్నారు. చాలామందికి అసలు ఈ అవగాహనా కూడా ఉండడం లేదు.

mobile 1

రోజు రోజు కు స్మార్ట్ ఫోన్ వినియోగాన్ని తగ్గించుకుంటూ రావడం వలన ఈ అనవసర ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. రోజులో మీరు ఎంత సేపు ఫోన్ ను వినియోగిస్తున్నారో ముందు తెలుసుకోండి. మీ సెట్టింగ్స్ లో డిజిటల్ వెల్ బీయింగ్ అనే ఆప్షన్ ద్వారా మీరు రోజుకు ఎంత సమయం ఫోన్ లో గడుపుతున్నారో తెలుసుకోవచ్చు. ఆ సమయాన్ని రోజు కొంత తగ్గించడం ద్వారా మీ ఫోన్ వాడకాన్ని తగ్గించండి. అందుకోసం ఈ టిప్స్ ను ఫాలో అవ్వండి.

mobile 4

  • మీ ఫోన్ లో మీకు అవసరం లేని ఆప్ లను అన్ ఇన్స్టాల్ చేసేయండి. అప్పుడప్పుడు మనం క్యూరియాసిటీ కొద్దీ కొన్ని ఆప్ లను డౌన్లోడ్ చేస్తుంటాం. అవి నోటిఫికేషన్ ను పంపినప్పుడల్లా మనం ఫోన్ ఓపెన్ చేస్తూ ఉంటాం. అందుకే అవసరం లేని వాటిని తీసేయడం, ఎప్పుడో అవసరం అవుతాయి అనుకుంటే నోటిఫికెషన్స్ ని మ్యూట్ చేయడం ద్వారా సమయం ఆదా చేసుకోవచ్చు.
  • మీరు వేరే పని లో ఉన్నపుడు, ఫోన్ అవసరం లేదు అనుకున్న సమయాల్లో ఫోన్ డేటా ను ఆఫ్ చేయడం అత్యుత్తమమైన పద్ధతి. తద్వారా అనవసరమైన నోటిఫికేషన్లు మిమ్మల్ని డిస్టర్బ్ చేయవు. అత్యవసరం అయిన వారు మెసేజ్ చేయడం కంటే కాల్ చేయడానికే ప్రిఫెరెన్స్ ఇస్తారు కాబట్టి అనవసర ఆందోళనలు పెట్టుకోవద్దు.

mobile 3

  • ఫేస్ బుక్, వాట్సాప్ వంటి సమాచార సాధనాలను మనం ఎక్కువ గా వినోదం కోసమే వాడుతున్నాం.. కాబట్టి వాటి కోసం పొద్దున్న, సాయంత్రం సమయాలలో ప్రత్యేకం గా ఓ సమయం కేటాయించుకోండి. ఆ సమయం లోనే వాటిని వాడండి.
  • ఇక యు ట్యూబ్ విషయానికి వస్తే.. ఆసక్తికరం గా ఉండే థంబ్ నైల్స్ మీ సమయాన్ని అమాంతం లాగేసుకుంటాయి. అందుకే నిర్దిష్టం గా ఓ సమయం కేటాయించుకోవడం ఉత్తమం. మీ ఫోన్ ని మీరు రూల్ చేసే విధం గా ఉండండి. ఫేస్ బుక్ లేదా యు ట్యూబ్ వంటి అప్లికేషన్స్ మిమ్మల్ని రూల్ చేసే విధం గా ఫోన్ కి బానిస అయిపోకండి.

mobile games

  • ఇక గేమ్స్ ఆడే వారి పరిస్థితి చెప్పక్కర్లేదు. ఎంత సేపు అలా ఆడుతూ ఉంటారో కూడా చెప్పలేము. దీనికి కూడా ఒక గంట లేదా అరగంట టైం సెట్ చేసుకుని ఆ టైం ప్రకారమే ఆడండి. ఎక్కువ సేపు ఆడడం కూడా మీ కళ్ళకు ప్రమాదమే కదా. వీలైనంత వరకు ఈ సమయాన్ని తగ్గించుకోండి.
  • వీటిని కేవలం చూసి వదిలేయడం కాకుండా.. వీటిని ఆచరించాలి ఫోన్ వాడకాన్ని తగ్గించాలి అని గట్టిగా అనుకోవడం కూడా ముఖ్యమే. సంకల్పమే సగం బలం. అందుకే మనసులో గట్టిగా అనుకోండి. మీ సమయాన్ని ఆదా చేసుకోండి.