మీ వైవాహిక జీవితాన్ని మరింత దృఢంగా మార్చుకోవాలి అనుకుంటున్నారా..? ఈ కొత్త సంవత్సరం నుండి మీ వైవాహిక జీవితాన్ని మరింత తీయగా మార్చుకోవాలి అనుకుంటే ఈ చిట్కాలను తప్పక ఫాలో అవ్వండి. చాలామంది భార్యాభర్తలు తమ బంధాన్ని దృఢంగా మార్చుకోవాలని చూస్తూ ఉంటారు.

Video Advertisement

మీరు కూడా ఈ కొత్త సంవత్సరంలో మీ భార్యాభర్తల మధ్య మార్పు రావాలని అనుకుంటే వీటిని అనుసరించండి అప్పుడు తప్పకుండా మీ బంధాన్ని దృఢంగా మార్చుకోవచ్చు.

#1. పాత గొడవలని మర్చిపోండి:

పాత గొడవలని పదే పదే తవ్వుకుంటే ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది సరి కదా అస్సలు పెరగమన్నా పెరగదు ఎప్పుడైనా సరే ఏదైనా గొడవ జరిగితే దానిని అక్కడికక్కడ మర్చిపోండి. కొత్త సంవత్సరం సందర్భంగా పాత గొడవలకి ఫుల్ స్టాప్ పెట్టేసి కొత్త జీవితాన్ని ప్రారంభించండి.

#2. మీ పార్ట్నర్ ని నవ్వించండి:

మీ హ్యూమర్ ని ఉపయోగించి మీ పార్ట్నర్ నవ్వేటట్టు.. మీ పార్ట్నర్ మీ పట్ల పాజిటివ్ గా ఉండేటట్టు మార్చుకోండి ఇలా మీ మధ్య ప్రేమని పెంచుకోవచ్చు.

#3. ఇతరులు చెప్పేది వినండి:

మీ మధ్య బంధం దృఢంగా ఉండాలంటే కచ్చితంగా మీరు ఇతరులు చెప్పేది వినండి మీకు మధ్యలో ఏమైనా చెప్పాలనిపించినా ఆగి వాళ్లు పూర్తి చేసుకున్న తర్వాత మీరు చెప్పండి.

#4. ఆర్థిక పరిస్థితుల్ని చూసుకోండి:

ఆర్థిక ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. లేకపోతే బంధం చెదిరిపోతూ ఉంటుంది. ఎప్పుడూ కూడా ఖర్చులని వాటిని కరెక్ట్ గా చూసుకుంటూ ఉండండి.

#5. ఓ కౌగిలింత కొన్ని ముద్దులు:

ప్రేమను పెంచుకోవడానికి ఈ రెండు బాగా ఉపయోగపడతాయి ఈ రెండిటితో మీ మధ్య బంధాన్ని దృఢంగా మార్చుకోవచ్చు. మీ పార్ట్నర్ కి మీ మీద ప్రేమ పెరుగుతుంది.

#6. సహాయం చేయడం:

కష్టాలను చూసి మీరు సహాయం చేస్తే మీరు తోడుగా ఉన్నారని వారికి అర్థమవుతుంది సో వాళ్లకి సహాయం కావలసినప్పుడు అడగకుండానే మీరు సహాయం చేయండి.

wife and husband

#7. పనులలో సహాయం చేయడం:

వారి పనులలో మీరు మంచిగా సహాయం చేసే మార్కులు కొట్టేయొచ్చు మీ మధ్య బంధాన్ని బలంగా మార్చుకోవచ్చు.

#8. కమ్యూనికేషన్:

కమ్యూనికేషన్ బాగుంటే బంధం బాగుంటుందని గుర్తుపెట్టుకోండి. మంచి కమ్యూనికేషన్ ద్వారా మీ పార్ట్నర్ తో మీరు ప్రేమ ని మరింత పెంచుకోవడానికి అవుతుంది.