ఆయిల్ రాసుకున్న వెంటనే జుట్టు ఎందుకు రాలిపోతుంది..? అసలు కారణం ఇదే..!

ఆయిల్ రాసుకున్న వెంటనే జుట్టు ఎందుకు రాలిపోతుంది..? అసలు కారణం ఇదే..!

by Anudeep

Ads

ప్రస్తుతం చాలా మంది ఎదుర్కుంటున్న సమస్య అధికంగా జుట్టు రాలడం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎన్ని మంచి ఆయిల్స్ ని వాడినా జుట్టు రాలిపోతోంది అంటూ చాలా మంది తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు. ముఖ్యంగా తలస్నానం చేస్తే చాలు.. ఈ జుట్టు మరింతగా రాలిపోతూ ఉంటుంది.

Video Advertisement

జుట్టు తడిగా ఉన్నపుడు దువ్వినా సరే చాలా ఎక్కువగా జుట్టు రాలిపోతూ ఉంటుంది. అంతే కాదు ఆయిల్ రాసినప్పుడు కూడా వెంటనే జుట్టుని దువ్వితే.. మరింతగా రాలిపోతూ ఉంటుంది. దీనికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అయితే ఇలా నూనె రాయగానే జుట్టు ఊడిపోవడం వలన.. మనం ఆ నూనె మన జుట్టుకి సరిపడలేదు అని భావిస్తూ ఉంటాం. అంతే కాదు.. కొత్తగా ఆయిల్స్ ట్రై చేస్తూ ఉంటాం. ఎన్ని ఆయిల్స్ ని ట్రై చేసినా నూనె రాసిన వెంటనే తలను దువ్వితే జుట్టు రాలిపోతుంది. మనం ఆయిల్ చేసే పద్ధతి వలన కూడా జుట్టు రాలే అవకాశం ఉంటుంది. ఆయిల్ రాసే ముందు జుట్టును చిక్కులు లేకుండా విడతీసుకోవాలి. ఇందుకోసం వెడల్పాటి దువ్వెనని ఉపయోగించాలి. ఆ తరువాత చేతులతో జుట్టు మొదళ్ళలో సున్నితంగా మసాజ్ చేస్తూ ఆయిల్ ను అప్లై చేయాలి.

చాలా మంది చేసే తప్పు ఏంటంటే.. నూనె రాసుకున్నాక జుట్టుని గట్టిగా ముడి కట్టేస్తారు. దీనివల్ల స్కాల్ప్ పై ఉండే జుట్టు బలహీనంగా మారి.. ముడి తీసి దువ్వగానే రాలిపోతుంది. అందుకే నూనె రాసిన తరువాత కొంతసేపు అలా వదులుగా వదిలేయడం మేలు. నూనె ఎక్కువగా రాయడం వలన స్కాల్ప్ రంధ్రాలు మూసుకుపోతాయి. జుట్టు పెరుగుదల ఆగిపోతుంది. అందుకే తగు మాత్రమే రాయాలి. అలాగే నూనె రాసిన తరువాత ఎక్కువ రోజులు ఉంచకూడదు. దీని వలన మురికి కణాలు పేరుకుని జుట్టు పాడైపోతుంది.


End of Article

You may also like