ఇంటికి కోడల్ని తెచ్చుకునే విషయం లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఈ పొరపాట్లను అస్సలు చేయకండి..!

ఇంటికి కోడల్ని తెచ్చుకునే విషయం లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఈ పొరపాట్లను అస్సలు చేయకండి..!

by Anudeep

Ads

వివాహ బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. రెండు మనసుల్నే కాదు.. రెండు కుటుంబాల మనుషులకి బంధుత్వం కలిపే ఒకే ఒక వేడుక వివాహం. ఇది ఎవరి జీవితం లో అయినా అద్భుతమైన ఘట్టమే. ఈ వేడుకను ఎంతో ముచ్చట గా జరుపుకుంటారు. ఏ తల్లి అయినా.. తన కొడుక్కి తనలా ప్రేమగా చూసుకునే అమ్మాయిని కోడలిగా తీసుకురావాలని కోరుకుంటుంది.

Video Advertisement

kodalu 1

ఇంటికి వచ్చే అమ్మాయి తమ కూతురిలా ఇంట్లో మనుషులతో కలిసిపోయి ఇంటికే కళ తీసుకురావాలి అని అందరు కోరుకుంటారు. కొడుకుకి పెళ్లి చేసే ముందు తమ ఇంట్లో ఇమడగలిగే అమ్మాయి ని చూసుకోవాలి. అంతే కానీ, కట్నం ప్రాతిపదికన సంబంధాలు చూసుకోవడం సరికాదు. ఒకవేళ ఎక్కువ కట్నం ఇచ్చి ఇంటికి వచ్చిన అమ్మాయి మనసు మంచిది కాకపోతే.. ఆ కుటుంబం జీవితాంతం బాధలు పడాల్సి వస్తుంది. లేదంటే, ఆ వివాహ బంధం కేవలం మూడునాళ్ళ ముచ్చటే అవుతుంది. అందుకే.. ఇంటికి కోడలిని తెచ్చుకునే విషయం లో తప్పనిసరిగా జాగ్రత్త గా ఉండాలి.

 

పెళ్లి రోజు పెళ్లి కూతురుతో అస్సలు అనకూడని 6 విషయాలు

representative image

కొంతమంది తమ కొడుక్కి కాబోయే భార్య మెరుపుతీగలా అందం గా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. అందం, కట్నం ఇవి కాదు చూడాల్సింది. ఒక మంచి అమ్మాయి ని నిర్వచించాలంటే అందం ఉంటె సరిపోతుందా? ఒకరికి అందం గా కనిపించేది మరొకరికి అందం గా ఉండకపోవచ్చు. అమ్మాయి అంతః సౌందర్యం ఎలా ఉంది అనేది చూసుకోవాలి. అమ్మాయిని ఎంచుకునేటపుడు ఆమె అందానికి, ఆస్తిపాస్తులకు కాకుండా ఆమె గుణానికి ప్రాధాన్యత ను ఇవ్వాలి.

kodalu 3

representative image

కొంతమంది అమ్మాయి కుటుంబం స్థాయిలను కూడా చూసుకుంటారు. స్థాయి కలవకపోతే బంధుత్వం కలుపుకోవడానికి చూడరు. కానీ.. స్థాయి ఉన్నతమైనది అయినా, అమ్మాయి మనసు ఉన్నతమైంది కాకపోతే పెళ్లి అయ్యాక ఇక్కట్లు తప్పవు. అందుకే.. అమ్మాయి స్థాయి గురించి కాకుండా.. కుటుంబ గౌరవాన్ని నిలబెట్టగలుగుతుందా? లేదా? అనేది చూసుకోవాలి. ఒక అబ్బాయి తన ఇంటి వంశాన్ని మాత్రమే నిలబెడతాడు. కానీ, ఒక అమ్మాయి ఇరు కుటుంబాల గౌరవాన్ని నిలబెడుతుంది.

kodalu 4

representative image

“ఆడపిల్ల” అంటూ పుట్టిన దగ్గరనుంచే ఆడ ఉండాల్సిన పిల్ల అన్నట్లు పెంచుతారు. పాతికేళ్ళు తిరిగిన ఊరు, స్నేహితులు, కుటుంబ సభ్యులు అందరిని వదిలేసి మీ కోసం వచ్చే పిల్ల కు ఏమిచ్చి ఋణం తీర్చుకోగలుగుతారు? అందుకే ఆమె గుణాన్ని చూసి గౌరవించి ఇంటికి తెచ్చుకోవాలి తప్ప కట్న కానుకలని ఆశించో, ఆమె స్థాయిని చూసో కాదు. ఇలాంటి పొరపాట్లు చేయకుండా.. మంచి మనసు ఉన్న అమ్మాయిని తెచ్చి పెళ్లి చేస్తే.. వారిద్దరి దాంపత్యం అన్యోన్యం గా ఉంటుంది అనడం లో ఆశ్చర్యం లేదు.


End of Article

You may also like