మూత్రంలో మంట, నొప్పితో బాధపడుతున్నారా..?ధనియాలతో ఇలా చేస్తే చాలా రిలీఫ్.!

మూత్రంలో మంట, నొప్పితో బాధపడుతున్నారా..?ధనియాలతో ఇలా చేస్తే చాలా రిలీఫ్.!

by kavitha

Ads

కొందరు మూత్ర విసర్జన చేసే సమయంలో మంట, నొప్పితో బాధపడతారు. మూత్ర విసర్జన చేసే సమయంలో మంటగా అనిపించడానికి మూత్రనాళ ఇన్ఫెక్షన్ (యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్) కారణం కావచ్చు. వేసవిలో మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

Video Advertisement

మూత్ర విసర్జన టైమ్ లో మంట లేదా నొప్పి కలిగినా, ఆ విషయాన్ని ఇతరులకు చెప్పలంటే చాలా మంది ఇబ్బంది పడతుంటారు. ఇలాంటి సమస్యలు ఎదురైనపుడు డాక్టర్ వద్దకు వెళ్లాలనే ఆలోచన కూడా చేయరు. అయితే ప్రారంభంలోనే మూత్రంలో మంటను సింపుల్ టిప్స్ తో తగ్గించవచ్చు.  ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..

మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ వల్ల మూత్రవిసర్జన చేసేటపుడు మంట, నొప్పి కలుగుతుంది. ఈ ఇన్ఫెక్షన్‌ ను నివారించడానికి ధనియాలు, ధనియాలు నానబెట్టిన వాటర్ మంచిగా పనిచేస్తాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయంలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లకు ధనియాల వాటర్ సూపర్ హీరో.  క్రమం తప్పకుండా కొద్ది రోజుల పాటు ధనియాలు నానబెట్టిన వాటర్ ని తాగడం వల్ల మూత్ర విసర్జన చేసేటపుడు మంట, నొప్పిల నుండి ఉపశమనం కలుగుతుందని నిపుణులుచెబుతున్నారు.

ఒక టేబుల్ స్పూన్ ధనియాలను, ఒకటిన్నర కప్పుల వాటర్ లో రాత్రంతా నానబెట్టి, మర్నాడు పొద్దున్నే నానబెట్టిన ధనియాలను తినాలి. వీటిలో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉండడం వల్ల హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడటానికి తోడ్పడతాయి. ధనియాల నీరు తాగడం వల్ల మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ తగ్గడానికి ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా మూత్ర విసర్జన చేసటప్పుడు  మంట, నొప్పి లాంటి ఇబ్బందులు తగ్గుతాయి.

అంతేకాకుండా ధనియాలలోని  యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆర్థరైటిస్ వంటి సమస్యల నుండి రిలీఫ్ ను కలిగిస్తుంది. ఇకఆ ధనియాల నీటిని రోజు తీసుకోవడం ద్వారా జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. ధనియాల నీరు తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. డయాబెటిక్ పేషెంట్లు నిత్యం పొద్దున్నే ధనియాల వాటర్ ని తాగడం వలన మంచి జరుగుతుంది. అంతేకాకుండా జీవక్రియ కూడా పెరుగుతుంది.  నిత్యం పొద్దున్నే ఖాళీ కడుపుతో ధనియాల వాటర్ తాగడం వల్ల బరువు తగ్గుతారు.

Also Read: మీ అరచేతులకు చెమటలు పడుతున్నాయా.? అశ్రద్ధ చేయకండి…ఈ వైఫల్యం కావచ్చు!


End of Article

You may also like