తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్ళేటప్పుడు ఈ తప్పులని చెయ్యకండి..!

చాలామంది తిరుమలలో ఉన్న శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. విదేశాలలో ఉండే భారతీయులు కూడా భారతదేశానికి వచ్చినప్పుడు తిరుమలకు వెళుతూ ఉంటారు. శ్రీవారిని దర్శించుకోవడం వల్ల అంతా మంచి కలుగుతుందని ఏడు కొండలు ఎక్కి వెళ్లే వాళ్లు కూడా చాలా మంది ఉంటారు.

అయితే శ్రీవారిని దర్శనం చేసుకునేటప్పుడు ఎక్కువ మంది ఈ తప్పులు చేస్తారట. మీరు కూడా చాలా సార్లు తిరుమల వెళ్లారా..? మీరు ఈ తప్పులు చేశారేమో చూసుకోండి.

ఈ తప్పులను చూసి మరోసారి తిరుమల వెళ్లినప్పుడు వాటిని చేయకండి. మరి తిరుమల వెళ్లే వాళ్ళు ఎటువంటి తప్పులు చేయకూడదు అనేది తెలుసుకుందాం. స్వామివారిని దర్శనం చేసుకునేటప్పుడు ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాలి.

వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చేవాళ్ళు కచ్చితంగా అమ్మవారిని కూడా మనం దర్శనం చేసుకోవాలి. తిరుచానూర్ పద్మావతి అమ్మవారిని శ్రీవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకోవాలి. దీని వెనుక అర్థం ఏమిటంటే మనం సాధారణంగా మనకి ఏం కావాలన్నా అమ్మని అడుగుతాము. అమ్మ నాన్నని అడిగి ఒప్పిస్తుంది ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అందుకనే కచ్చితంగా ఇద్దరి దర్శనాలు చేసుకోవాలి.

వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే ముందు శ్రీ గోవింద రాజుల స్వామి వారి గుడిని కూడా దర్శించుకోవాలి. పాలకడలిలో ఉండే శ్రీమహావిష్ణువే గోవిందరాజులు వారు. అలానే తిరుమల కి వెళ్ళాలి అంటే మీరు అలిపిరి మెట్లు కానీ శ్రీవారి మెట్టు నుండి కానీ వెళ్ళవచ్చు. ఇది నిజంగా ఉత్తమం.

వరాహ నరసింహస్వామి వారిని కూడా తప్పక దర్శించుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుంటున్నాం అంటే దానికి కారణం వరాహ నరసింహ స్వామి వారు. తిరుమల కొండల్లో మొట్టమొదటిసారి వరాహ నరసింహస్వామి వారు ఉండేవారు అయితే తిరుమలలో ఉండడానికి వెంకటేశ్వర స్వామి వారికి కొంత స్థలం కావాలని వరాహ నరసింహస్వామి వారిని అడగగా… దానికి బదులుగా వెంకటేశ్వర స్వామి వారు ప్రథమ పూజ, ప్రథమ నైవేద్యం వరదం నరసింహ స్వామి వారికి ఇస్తానని మాటిచ్చారు.

కనుక వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్లేవారు మొట్టమొదట వరాహ నరసింహస్వామి వారిని దర్శించుకుంటే మంచిది. ఇలా వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్లే వారు ఆచరిస్తే స్వామివారి అనుగ్రహం మీకు కలుగుతుంది.

Also Read: నవరాత్రుల్లో తినకూడని పదార్థాలు ఏవో తెలుసా..?