Ads
కలియుగ దైవంగా భావించుకునే ఏడుకొండల వేంకటేశ్వర స్వామి వారు కొలువుదీరిన దివ్య క్షేత్రం తిరుమల తిరుపతి. కలియుగ వైకుంఠం తిరుమలలో ఎటు చూసినా గోవింద నామ స్మరణే. ఏడుకొండలవాడి దర్శనం కోసం పరితపిస్తుంటారు భక్తులు. తమ శక్తి కొద్దీ కానుకలు సమర్పిస్తారు. 15 వేల సంవత్సరాల నుంచి తిరుపతిని భక్తులు దర్శించుకుంటున్నారు.
Video Advertisement
అయితే అప్పటికీ ఇప్పటికీ తిరుమల లో ఎన్నో మార్పులు వచ్చాయి. కాశి తర్వాత హిందువులకి అత్యంత పవిత్రమైన స్థలం తిరుమల. అయితే తిరుమలలో ఎన్నో స్వామివారికి సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. వాటికి సంబంధించిన పలు కర పత్రాలను ముద్రిస్తారు. అయితే ఇప్పుడు స్వామి వారికి సంబంధించి డైరీ లు, క్యాలెండర్లు ఇస్తున్నారు కానీ ఒక్కప్పుడు కేవలం కరపత్రాలను మాత్రమే ముద్రించేవారు.
గుడికి వెళ్లిన భక్తులు మనకున్న కష్టాలను దైవానికి విన్నవించుకోవాలని, మనస్సు ప్రశాంతంగా చేసుకోవాలని మనము భగవంతుడిని ఆశ్రయిస్తూ ఉంటాము. మనము భగవంతుడిని కోరుకోగానే ఆ బాధలు తీరాలంటే అందుకు తగిన అర్హత భగవంతుడి దగ్గర మనం పొందాలి. అసలు ఆలయానికి వెళ్లినప్పుడు మనం ఎలాంటి మనస్సుతో దేవుడిని దర్శించుకోవాలి అన్న విషయాలు మనకు చాలా మంది చెప్పరు.
అయితే తాజాగా 42 సంవత్సరాల క్రితం ముద్రించిన పామ్ప్లేట్ ఒకటి నెట్ లో వైరల్ గా మారింది. 1981 లో ముద్రించిన ఈ కర పత్రం లో హిందువులు ఎటువంటి నియమాలు పాటించాలి, ఎలా ఉండాలి అన్నది ముద్రించి ఇచ్చారు. అందులో ఏం రాసి ఉందంటే..
ప్రతి ఒక్కరు రోజు స్నానం చేసి నుదుటిన బొట్టు ధరించాలి. ఆ తర్వాత దేవుణ్ణి స్మరించుకోవాలి. ఇంటి ముందు ఓం కారాన్ని రాయండి. వారానికి ఒకసారి దేవాలయాలకు వెళ్ళాలి. సామాజిక ఉత్సవాల్లో పాల్గొనండి.. వీలైనంత ఎక్కువ మందికి సాయం చెయ్యండి అని ఆ కర పత్రం లో ముద్రించారు. దాన్ని చూసిన నెటిజన్లు అప్పటి కాలం లో సంస్కృతి సంప్రదాయాలను కాపాడేందుకు వాళ్ళు చేసిన కృషి ని చూసి అబ్బురపడుతున్నారు. ఏదేమైనా గడచిన రోజులు.. ఆ కాలం చాలా మంచిది అని కామెంట్స్ చేస్తున్నారు.
End of Article