“తిరుపతి-బ్రిటిషర్” … ఈ కథ తెలుసా..? ఏం జరిగిందంటే..?

“తిరుపతి-బ్రిటిషర్” … ఈ కథ తెలుసా..? ఏం జరిగిందంటే..?

by kavitha

Ads

తిరుపతిలో శ్రీవేంకటేశ్వర స్వామికి వారికి ప్రతిరోజు సమర్పించే నైవేద్యాలను పెద్ద రాగిపాత్రలో నివేదిస్తారు. వాటిని గంగాళం అని అంటారు. అయితే ఈ గంగాళంలో మాత్రమే ప్రసాదాలను ఎందుకు సమర్పిస్తారు. ఈ గంగాళం ఎక్కడి నుండి వచ్చింది. ఆ గంగాళం వెనుక ఉన్న కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఇంస్టాగ్రామ్ పేజీ అయిన వి బ్లాగ్ కథనం ప్రకారం, క్రీ.శ 1821లో ఇండియాను బ్రిటీషర్లు పాలిస్తున్న సమయంలో కలెక్టరుగా థామస్ మన్రో నియమింపబడ్డాడు. స్కాటిష్ సైనికుడు అయిన మన్రో 1779 లో, అతను బ్రిటిష్ సైన్యంలో చేరాడు. అతను హైదర్ అలీ, టిప్పు సుల్తాన్‌ లతో జరిగిన యుద్ధాలలో పోరాడాడు.
మన్రో పోరాట పటిమను చూసిన ఉన్నతాధికారులు ఆయనను రాయలసీమ ప్రాంతానికి  కలెక్టరుగా మరియు ఇంచార్జ్ గా నియమించారు. మన్రో ఒకసారి తిరుపతికి వెళ్లి ఆలయం చుట్టూ చూడాలని నిర్ణయించుకున్నాడు. అతను ప్రాంగణాన్ని చూస్తున్నప్పుడు, వందలాది మంది భక్తులు ఒట్టి చేతులతో ప్రసాదం తింటూ కనిపించారు. జనం చేతులతో ప్రసాదం తింటున్న విధానం చూసి మన్రో పరిశుభ్రత లేకుండా తింటున్నారని, ఇకపై ప్రసాదం పంపిణీ చేయకూడదని ఆజ్ఞాపించాడు. అలా తినడం వళ్ళ డయేరియా, కలరా వస్తాయని చెప్పాడు.
అతనితో పాటు వచ్చిన అధికారులు భక్తుల చేతిలోని ప్రసాదంను విసిరేశారు. ఇది జరిగిన తరువాత మన్రోకి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. అనేక మంది వైద్యులు వచ్చినప్పటికీ  మన్రో నొప్పిని తగ్గించలేకపోయారు. ఈ క్రమంలోనే మద్రాసు గవర్నమెంట్ మన్రోకి మంత్రాలయం వెళ్ళి పన్నులు వసూల్ చేయమని చెప్పింది. అప్పటికి రాఘవేంద్ర స్వామి సజీవ సమాధి అయ్యి 100 సంవత్సరాలు అయ్యింది. మన్రో చెప్పు తీసేసి ఆలయం లోపలికి వెళ్ళాడు. అయితే అక్కడ ఒక ఋషి ఇంగ్షీష్ లో మఠం గురించి చెప్తున్నాడు. ఆయన ఒక్క మన్రోకి మాత్రమే కనిపించాడు.
ఆయనతో ఉన్న ఎవరికి కనిపించలేదు. అందరు మన్రోను వింతగా చూడడటం మొదలు పెట్టారు. అప్పుడు అతనికి కనిపించింది రాఘవేంద్ర స్వామి అని అర్ధం చేసుకుని ఆయన భక్తుడిగా మారాడు. కానీ ఆయన కడుపు నొప్పి మాత్రం తగ్గలేదు. అప్పుడు రాఘవేంద్ర స్వామివేరొక రూపంలో మన్రో దగ్గరికి వచ్చి, నాయన నువ్వు భక్తులకు వేంకటేశ్వర స్వామి ప్రసాదం అందకుండా చేశావు. అక్కడికి వెళ్ళిన వారు ఆకలితో ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల నువు వెళ్ళి నీ తప్పుని సరిదిద్దుకోవాలని చెప్పారట. వెంటనే మన్రో తిరుమలకి వెళ్ళి, తన చేతితో ప్రసాదం తిన్నాడు.
ఎంత ఎక్కువ తింటే అంత నొప్పి తగ్గి ప్రసాదం మొత్తం తినేసరికి కడుపునొప్పి తగ్గిపోయింది. తన తప్పుడు ఆర్డర్ తొలగించి భక్తులకు ప్రసాదం ఇవ్వడం పునఃప్రారంభించవలసిందిగా ఆలయ అధికారులను ఆదేశించాడు. సమీపంలోని కొడపాయల్‌ గ్రామం నుంచి వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని ప్రసాదం తయారీ కోసం కేటాయించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అలాగే ప్రసాదాన్ని బుట్టలో కాకుండా గంగాళంలో సమర్పించాడు. అలా అప్పటి నుండి ప్రసాదాన్ని గంగాళంలో సమర్పిస్తున్నారు. ఈ సంఘటనతో మన్రో మరియు అతని కుటుంబం శ్రీనివాసునికి అమితమైన భక్తులుగా మారారు. మన్రో పేరుతో కూడా ప్రసాదాన్ని సమర్పించేవారు. చేతులతో తింటే ఏ కలరా వస్తుందని మన్రో చెప్పాడో చివరి అదే కలరా సోకి మన్రో కర్నూల్ లోని పత్తికొండ అనే గ్రామంలో జులై 6, 1827 లో మరణించాడు.

End of Article

You may also like