Ads
ఆదిమానవుల కాలం నుంచి అనేక ఇబ్బందులకు, అవసరాలకు కొత్త దార్లు వెతుక్కుంటూ ప్రస్తుత నాగరిక సమాజానికి మానవులు చేరుకున్నారు. కానీ, గతం లో మానవులు ఎలా బతికేవారో చరిత్ర చెబుతూనే ఉంటుంది. అలా.. ప్రాచీన రోమ్ కాలం లో ఎలాంటి మరుగుదొడ్లు వాడేవారో తెలిస్తే, మీ ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అసలు ఇలాంటి మరుగుదొడ్లను ఎలా వాడేవారో అనే సందేహం కలగక మానదు.
Video Advertisement
అప్పట్లో ప్రజలు సామూహికం గానే మరుగుదొడ్లు వినియోగించేవారు. ఇప్పటిలోలా ప్రైవసీ ఉండేది కాదు. ఓ చెక్కబల్లపై వరుస గా రంద్రాలు ఏర్పాటు చేసి, వాటి కింద నీరు ప్రవహించే విధం గా ఏర్పాటు చేసేవారు. టాయిలెట్ కి వెళ్లాలనుకునే వారు వచ్చి ఆ రంద్రాలపై కూర్చుని పని పూర్తి చేసుకోవాలి. అలాగే, మలాన్ని శుభ్రపరుచుకోవడానికి జిలోస్పోంగియం అనే వస్తువుని వాడే వారట. జిలోస్పోంగియం అంటే.. పొడుగ్గా ఉన్న ఓ కర్రకి స్పాంజ్ ని అమర్చేవారు. దానినే నీటిలో ముంచి మలాన్ని శుభ్రపరుచుకునేవారు.
అయితే, ధనవంతులు మరియు పరపతి కలిగిన వారు మాత్రం వీటిని మరింత శుభ్రపరుచుకునే వారు. వేడి నీటిలో లేదా, వెనిగర్ లో వీటిని ముంచి శుభ్రపరిచాకే వాడేవారు. ధనవంతుల ఇళ్ళలో పనివాళ్ళు ఉండేవారు కాబట్టి, వారు తాము మల విసర్జనకు వెళ్లేముందు వాటిని శుభ్రపరచాలి ఆదేశించేవారు. కానీ, సామాన్యులకు ఇలాంటి వెసులుబాటు ఉండేది కాదు. దానితో ఒకరినుంచి మరొకరికి విచిత్రమైన అంటురోగాలు వ్యాప్తి చెందేవి. ధనవంతులు తాము కూర్చునే సీట్లను కూడా వేడి చేయించుకునేవారట. బాక్టీరియా వంటి సూక్ష్మ క్రిములను నశింప చేయడం కోసం ఇలా చేసేవారట. అయినప్పటికీ, అంటువ్యాధులు ప్రబలడం ఎక్కువ గా ఉండేది.
సామూహికం గా విసర్జన చేస్తున్న సమయం లో ఎక్కువ మొత్తం లో మలం వద్ద నుంచి మీథేన్ గ్యాస్ విడుదల అవ్వడం వలన విస్ఫోటనాలు సంభవించేవట. కొన్ని కొన్ని సార్లు అక్కడే తిరుగాడే ఎలుకలు వృషణాలను కొరికేస్తూ ఉండేవట. అప్పట్లో జనాలు టాయిలెట్ కి వెళ్ళడానికి ఎంతగానో భయపడేవారు. తమ విసర్జన క్షేమంగానే జరగాలని తమ దేవత అయిన ఫార్చునా ను ప్రార్ధించినతరువాత విసర్జన కు వెళ్లేవారట. ఇది చదవడానికి ఎంతో జుగుప్సాకరం గా ఉన్నప్పటికి.. నాగరికత అభివృద్ధి చెందని కాలం లో అప్పటి వారు ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారని చరిత్ర చెబుతోంది.
https://logicaltelugu.com/roman-toilets/
End of Article