సెకండ్ వేవ్ లో కరోనా బారిన పడ్డ 10 మంది టాలీవుడ్ సెలెబ్రిటీస్..!

సెకండ్ వేవ్ లో కరోనా బారిన పడ్డ 10 మంది టాలీవుడ్ సెలెబ్రిటీస్..!

by Anudeep

Ads

 

ప్రస్తుతం ఎటు చూసినా కరోనా గురించిన చర్చే.. సెకండ్ వేవ్ చాలా వేగం గా వ్యాప్తి చెందుతోంది. దానికితోడు.. గతం లో ఉన్న భయం ఇపుడు చాలా మందిలో లేకపోవడం తో.. బయట విచ్చలవిడిగా తిరుగుతున్న వారు కూడా ఎక్కువ అయ్యారు. సందు దొరికితే.. కాటు వేయడానికి కరోనా కాచుకుని సిద్ధం గా ఉంది.

Video Advertisement

ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఏ మాత్రం ఏమరుపాటు గా ఉన్నా కరోనా వచ్చేస్తోంది. సెలెబ్రిటీలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారన్న సంగతి మనకి తెలిసిందే. కానీ.. వారిని కూడా కరోనా వదల్లేదు. వారి ఇంటిని కూడా శానిటైజ్ చేయడానికి బోలెడు మంది పని వాళ్ళు కూడా ఉంటారు. సామాన్యులతో పోలిస్తే.. సెలెబ్రెటీలకు కొంత జాగ్రత్త ఎక్కువే ఉంటుంది. కానీ.. సెకండ్ వేవ్ వచ్చాక పాజిటివ్ ల సంఖ్య పెరుగుతోంది. సెకండ్ వేవ్ లో కరోనా బారిన పడ్డ 10 మంది టాలీవుడ్ సెలెబ్రిటీల లిస్ట్ పై ఓ లుక్ వేయండి.

#1 బన్నీ:

1 allu arjun
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనా బారిన పడి .. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారట. ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్ లోనే ఉన్నారట.

#2 నివేదా:

2 nivetha
“వకీల్ సాబ్” సినిమా ప్రమోషన్ టైం లో నివేద కు పాజిటివ్ వచ్చింది. అయితే.. ఆమె త్వరగానే కోలుకుని వకీల్ సాబ్ సినిమా ను థియేటర్ లో కూడా చూసారు.

#3 దిల్ రాజు:

3 dil raju
టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు కూడా కరోనా బారిన పడ్డారు. హోమ్ ఐసోలేషన్ లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన కరోనా నుంచి కోలుకున్నారు.

#4 బండ్ల గణేష్:

4 bandla ganesh
నిర్మాత కమ్ కమెడియన్ అయిన బండ్ల గణేష్ కూడా కరోనా బారిన పడి కోలుకున్నారు. ఆయన రెండు సార్లు కరోనా బారిన పడి కోలుకున్నారు.

#5 పూజ హెగ్డే:

5 pooja hegde
బుట్టబొమ్మ పూజ హెగ్డే కూడా కరోనా బారిన పడి స్వల్ప సమయం లోనే తిరిగి కోలుకున్నారు.

#6 అలియాభట్:

6 alia
ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్న అలియా భట్ కూడా కరోనా బారిన పడి.. కొన్ని రోజుల వరకు ట్రీట్ మెంట్ తీసుకుని ఆ తరువాత కోలుకున్నారు.

#7 విజయేంద్ర ప్రసాద్:

7 vijayendra prasad
ప్రముఖ రచయితా, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా కరోనా బారిన పడ్డారు.

#8 పవన్ కళ్యాణ్:

8 pavan kalyan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఫామ్ హౌస్ లోనే ఉండి ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నారు. చిరు, రామ్ చరణ్ ఆయన కోసం ప్రత్యేకం గా అపోలో వైద్యులతో మాట్లాడి నిపుణులతో చికిత్స చేయించారు.

#9 అల్లు అరవింద్:

allu aravind
నిర్మాత అల్లు అరవింద్ కూడా కరోనా బారిన పడ్డారు. ఈయన వాక్సిన్ వేయించుకున్నప్పటికీ కరోనా తో బాధపడ్డారు. అయితే.. వాక్సిన్ వేయించుకోవడం వలెనే ఈయనకు తొందరగా కోలుకోవడం సాధ్యమైందని తెలిపారు.

#10 రమేష్ వర్మ:

10 ramesh varma
రవితేజ తో “ఖిలాడీ” సినిమా కు దర్శకత్వం వహిస్తున్న రమేష్ వర్మ కూడా ఇటీవల కరోనా బారిన పడ్డారు.

 


End of Article

You may also like