“ముంబైని అస్సాం ట్రైన్ ఎక్కించారుగా.?” అంటూ రాజస్థాన్ పై కోల్‌కతా మ్యాచ్ గెలవడంతో ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్స్.!

“ముంబైని అస్సాం ట్రైన్ ఎక్కించారుగా.?” అంటూ రాజస్థాన్ పై కోల్‌కతా మ్యాచ్ గెలవడంతో ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్స్.!

by Mohana Priya

Ads

షార్జా వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకి, రాజస్థాన్ రాయల్స్ జట్టుకి మధ్య జరిగిన మ్యాచ్ లో 86 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ఓపెనర్లు శుభమన్ గిల్ (56: 44 బంతుల్లో 4×4, 2×6), వెంకటేశ్ అయ్యర్ (38: 35 బంతుల్లో 3×4, 2×6) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడారు. దాంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు 4 వికెట్ల నష్టానికి 171 పరుగుల స్కోర్ చేసింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో చేతన్ సకారియా ఒక వికెట్, రాహుల్ తెవాటియా ఒక వికెట్, గ్లెన్ ఫిలిప్స్ ఒక వికెట్, క్రిస్ మోరీస్ ఒక వికెట్ పడగొట్టారు.

Video Advertisement

Top 15 trolls on kkr winning against rr

తర్వాత ఛేదనలో ఏ దశలో కూడా రాజస్థాన్ రాయల్స్ జట్టు గెలుపు దిశగా ముందుకు వెళ్లలేదు. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్ (0), లివింగ్ స్టోన్ (6)తో పాటు కెప్టెన్ సంజు శాంసన్ (1), అనుజ్ రావత్ (0), గ్లెన్ ఫిలిప్స్ (8) సింగిల్ డిజిట్‌ స్కోర్ తో వరుసగా పెవిలియన్ కి చేరారు. ఈ దశలో శివమ్ దూబె (18: 20 బంతుల్లో 1×6)తో కలిసి రాహుల్ తెవాటియా (44: 36 బంతుల్లో 5×4, 2×6) దూకుడుగా ఆడిన కూడా ప్రయోజనం లేదు. టీమ్స్ స్కోర్ 34 వద్ద ఉన్నప్పుడు దూబె అవుట్ అవ్వగా తర్వాత వచ్చిన క్రిస్ మోరీస్ (0), జయదేవ్ ఉనద్కత్ (6), చేతన్ సకారియా (1) క్రీజ్ లో కొంచెం సేపు కూడా నిలవలేకపోయారు. ఆఖరివరకు ఆడిన రాహుల్ తెవాటియా, టీమ్ స్కోర్ 85 వద్ద ఆఖరి వికెట్‌ గా వెనుదిరిగారు. కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్లలో శివమ్ మావి 4 వికెట్లు, ఫెర్గూసన్ మూడు వికెట్లు, వరుణ్ చక్రవర్తి ఒక వికెట్, షకీబ్ అల్ హసన్ ఒక వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

 

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18


End of Article

You may also like