సాధారణంగా వేసవి సెలవుల్లో ఎక్కువగా టూర్లకు వెళ్ళడానికి సిధ్ధం అవుతుంటారు. సమ్మర్ లో వచ్చే హాలిడేస్ మరియు సమ్మర్ లో చల్లదనం ఉండే కోసం ప్రదేశాలు వెదుకుతుంటారు. అలాంటి వారు పర్యటించేందుకు కర్ణాటకలోని చల్లని అనువైన ప్రదేశాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

Video Advertisement

1. జోగ్ జలపాతం:
షిమోగా జిల్లాలోని జోగ్ ఫాల్స్ 488 మీటర్ల ఎత్తులో ఉండే జలపాతం ఇండియాలోనే ఎత్తైన జలపాతాలలో ఒకటి. ఇది అక్కడ దట్టమైన అడవుల మధ్యలో ఉంటుంది. అక్కడ ఎండకాలంలో కూడా జలపాతాలు ఎంతో ఆకట్టుకుంటాయి.  కయాకింగ్, కొరాకిల్ రైడింగ్ దగ్గరలోని అడ్వెంచర్ క్యాంపులలో పాల్గొనే కార్యకలాపాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి.2.మరవంతే:
ఈ ప్రదేశం చాలా సుందరమైన కొడచాద్రి కొండలకు దగ్గరగా ఉండే  తీరప్రాంత గ్రామం. ఈ బీచ్ కి  అరేబియా సముద్రం ఒకవైపు, సౌపర్ణికా నది మరోవైపు చక్కగా ఉంటుంది. సముద్రం, నది కలిసే ఈ ప్రదేశాన్ని పర్యాటక కేంద్రంగా మార్చారు.  స్థానిక వంటకాలను ఎంతో రుచికరంగా ఉంటాయి.3.కుద్రేముఖ్
కుద్రేముఖ్ కొండ శ్రేణులు ప్రకృతిని ఆరాధించేవారికి, ట్రెక్కింగ్  చేసేవారికి అద్భుతమైన ప్రదేశం. జీవ వైవిధ్యం, పర్వతాలు, జలపాతాలతో కూడిన కుద్రేముఖ్ వేసవిలో గొప్ప విహారయాత్ర. కలసా టెంపుల్ టౌన్, కుద్రేముఖ్ నేషనల్ పార్క్, కుద్రేముఖ్ పీక్, హనుమాన్ గుండి, లక్యా డ్యామ్ తప్పక చూడవలసిన ప్రదేశాలు.4.అగుంబే:
దక్షిణ భారతదేశపు చిరపుంజీగా ప్రసిద్ధి చెందిన అగుంబే అడవులు, జలధారలతో నిండి ఉంది. ఫోటోగ్రాఫర్‌లకు ఈ ప్రదేశం అద్భుతమైన సూర్యాస్తమయాలకు గమ్యస్థానంగా ప్రసిద్ధి చెందింది. కూడ్లు తీర్థ జలపాతం,  బర్కానా జలపాతం, జోగిగుండి, ఒనకే అబ్బి జలపాతాలు చల్లని వాతావరణాన్ని అందిస్తాయి.5. హొన్నెమర్దు:
అడ్వెంచర్ యాత్ర కోసం ఎదురు చూసేవారికి, హొన్నెమర్దు గమ్యస్థానం అని చెప్పవచ్చు. ఇది చిన్న గ్రామం అయినప్పటికి పర్యాటకులకు ఎన్నో వాటర్ గేమ్స్ ను అందిస్తుంది. ఈ గ్రామం శరావతి నది తీరాన ఉంది. ట్రెక్కింగ్, పక్షులను వీక్షించడం, క్యాంపింగ్ వంటివి చేయవచ్చు. ఈ గ్రామం జోగ్ జలపాతం, డబ్బే జలపాతాలకు దగ్గరలో ఉంది.
6.గోకర్ణం:
ప్రశాంతమైన ప్రదేశాలకు విహారయాత్ర వెళ్లాలనుకునే వారు కర్ణాటకలో ఉండే  గోకర్ణంకు వెళ్లవచ్చు. పచ్చదనంతో నిండిన గోకర్ణం ప్రశాంతతకు మారో పేరుగా చెబుతారు. ఇది బీచ్‌లు, రిసార్ట్‌లతో కూడిన అందమైన పట్టణం. దేశంలోని అత్యంత ప్రసిద్ది  చెందిన బీచ్‌లలో ఓం బీచ్ ఒకటి. ఈ ప్రదేశం హిందూ ఆధ్యాత్మిక చిహ్నంను పోలిన ఆకారంలో ఉంటుంది. పురాతన శివుడు, వినాయక దేవాలయాలు గోకర్ణంలో ఉన్నాయి.
Also Read: “స్వాతంత్రం” రాకముందు హైదరాబాద్ లో ఉన్న… “పరిస్థితులని” తెలిపే 15 ఫోటోలు..! అప్పట్లో హైదరాబాద్ ఎలా ఉండేది అంటే..?