రైలు హెడ్‌లైట్‌లో ఉండే బల్బులు ఎన్ని..? అవి ఎంత దూరం వరకు కనిపిస్తాయంటే..!

రైలు హెడ్‌లైట్‌లో ఉండే బల్బులు ఎన్ని..? అవి ఎంత దూరం వరకు కనిపిస్తాయంటే..!

by kavitha

Ads

సాధారణంగా బైక్ హెడ్‌లైట్‌ని, కారు హెడ్‌లైట్‌ని గమనించే ఉంటారు. మరి ట్రైన్ కు ఉండే హెడ్‌లైట్ ని ఎప్పుడైనా గమనించారా. వాటిని ఎప్పుడైనా దగ్గర నుండి చూశారా? ఈ హెడ్‌లైట్‌ లేకుండా ట్రైన్ రాత్రి సమయంలో ప్రయాణించలేదు. ఈ హెడ్‌లైట్‌ అనేది రైలు రైలుకి డీఫరెంట్ గా ఉంటుంది.

Video Advertisement

రైలు హెడ్‌లైట్‌ కి గురించిన  పలు విషయాలు ఎక్కువ మందికి తెలియదు. ట్రైన్ హెడ్‌లైట్‌ లో ఎన్ని రకాల లైట్లు ఉంటాయి. దానిలో ఎన్ని బల్బులు ఉంటాయో?  ఆ హెడ్‌లైట్‌ ఎంత దూరం వరకు కనిపిస్తుందో ఇప్పుడు చూద్దాం..
ఎన్ని రకాల లైట్లు..

రైల్వే సమాచారం మేరకు ట్రైన్ ఇంజిన్‌ 3 రకాల లైట్లను కలిగి ఉంటుంది. వాటిలో ఒక లైట్ దారిని చూపించడానికి ఏర్పాటు చేశారు. అనగా ఒకటి హెడ్‌లైట్, మిగతా 2 లైట్లు ఒకటి తెలుపు కాగా, మరొక లైట్ రెడ్ కలర్ లో ఉంటుంది. ఈ వీటిని లోకోమోటివ్ సూచికలు అని పిలుస్తారు.

హెడ్‌లైట్‌లో ఎన్ని బల్బులు..

ట్రైన్ హెడ్‌లైట్‌లో 2 బల్బులు ఉంటాయి. ఆ బల్బులు సమాంతరంగా అమర్చబడి ఉంటాయి. ఎందుకంటే ట్రైన్ వెళ్తున్నప్పుడు ఒక బల్బు పనిచేయక పోయిన రెండో బల్బు సహాయంతో దారి కనిపిస్తుంది.  హెడ్‌లైట్‌ ఎంత దూరం కనిపిస్తుంది..

ట్రైన్ హెడ్‌లైట్ వెలుగు సుమారు 350 నుండి 400 మీటర్ల దూరం దాకా కనిపిస్తుంది. ఇది 24వోల్ట్ డీసీ కరెంట్‌ తో వర్క్ చేస్తుంది. ఈ హెడ్‌లైట్ వల్ల రాత్రి పూట లోకో పైలట్ రైల్వే ట్రాక్‌ను కొంత దూరం దాకా చాలా క్లియర్ చూడగలడు.

షట్టింగ్ కోసం వెళ్ళినపుడు..

ట్రైన్ ఇంజిన్‌లో ఉండే హెడ్‌లైట్‌ మరియు తెలుపు, ఎరుపు లైట్లను ఒకేసారి అమర్చడం జరుగుతుంది. రైలును  షంటింగ్ చేయడం కోసం వ్యతిరేక దిశలో లో నడిపే సమయంలో ఎరుపు రంగు లైట్ ను ఆన్ చేస్తారు. రెడ్ లైట్ వెలిగినపుడు ఇంజిన్‌ షంటింగ్‌ కోసం రివర్స్ లో వెళుతున్న విషయం రైల్వే సిబ్బందికి అర్ధం అవుతుంది. ఇంజిన్ షంటింగ్ చేయడం కోసం ఇంకా ముందుకు వెళ్ళే సమయంలో వైట్ కలర్ లైట్ ను ఆన్ చేస్తారు.

Also Read: “భారతదేశం” లో జరిగిన మొట్టమొదటి ట్రైన్ ప్రమాదం ఏదో తెలుసా..? ఎక్కడ జరిగిందంటే..?


End of Article

You may also like