Ads
సాధారణంగా రోజు లక్షలాది మంది ఇండియన్స్ రైళ్లల్లో ప్రయాణిస్తూ తమ గమ్యాన్ని చేరుకుంటారు. కానీ వారిలో చాలా మందికి ఇండియన్ రైల్వే గురించి కానీ, ట్రైన్స్ కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఎక్కువగా తెలియదు.
Video Advertisement
రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై ఉండే నేమ్ బోర్డు ఎందుకు పసుపు రంగులో ఉంటుంది? ట్రైన్ కంపార్ట్‌మెంట్ వెనుక భాగంలో X అనే గుర్తు ఎందుకు ఉంటుంది? ఒక లీటర్ డీజిల్‌తో ట్రైన్ ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది లాంటి విషయాలు గమనించినప్పటికి చాలామందికి తెలియవు. అయితే ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అయితే రైలు ఒక కిలోమీటర్ ప్రయాణించడానికి ఎంత డీజిల్ ఎంత ఖర్చవుతుందో ఇప్పుడు చూద్దాం..
సాధారణంగా స్కూటర్, కారు, బస్సు, ట్రక్కువంటి వాహనాలకు మైలేజీ ఉండడం వల్ల 1 లీటర్ డీజిల్, పెట్రోల్ కి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తాయో తెలిస్తుంది. మరి రైలు మైలేజీ గురించి ఎప్పుడైనా అని ఆలోచించారా? ఇతర వాహనాల లాగానే రైళ్ల మైలేజీ చాలా విషయాల పై ఆధారపడి ఉంటుంది. అంతే కాకుండా రైళ్లకి ప్రమాణాలు కూడా ఉన్నాయి. అయితే రైలు మైలేజీని ఇతర వాహనాల మైలేజీ వలె నేరుగా చెప్పడం కష్టమైన విషయం.ఎందువల్ల అంటే ట్రైన్ మైలేజ్ అనేది అది ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైలు మరియు రైలు కోచ్‌ల నంబర్ పైన ఆధారపడి ఉంటుంది.రైలు మైలేజీకి చెందిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ట్రైన్ లోని కోచ్‌లు సంఖ్య. తక్కువ కంపార్ట్‌మెంట్ల ఉన్నట్లయితే రైలు ఇంజిన్‌పై ఎక్కువగా లోడ్ పడదు. ఇటువంటి సందర్భంలో రైలు ఇంజిన్ శక్తి పెరుగుతుంది. ఇక డీజిల్ రైలు ఇంజిన్ మైలేజీని గంటల ప్రాతిపదికన లెక్కిస్తారు. 24 నుండి 25 కోచ్‌లు ఉన్న ట్రైన్స్ లో ఒక కిలోమీటరుకు డీజిల్ సుమారు 6 లీటర్ల పడుతుందని కొన్ని నివేదికలలో తెలుపబడింది. అయితే సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ తో పోల్చినట్లయితే ప్యాసింజర్ రైళ్లకే డీజిల్ ఎక్కువగా ఖర్చు అవుతుందని తెలుస్తోంది.ప్యాసింజర్ ట్రైన్ లో ఒక కిలోమీటరు దూరం వెళ్లేందుకు ఐదు నుండి ఆరు లీటర్ల డీజిల్ ఖర్చవుతుంది. ఇలా అవడానికి కారణం ప్యాసింజర్ రైలు ఎక్కువ స్టేషన్లలో ఆగడమే. అయితే 12 కోచ్ లు కలిగిన ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఇంజిన్‌కు 1 కిలోమీటరు ప్రయణించడానికి సుమారు 4.5 లీటర్ల డీజిల్ ఖర్చు అవుతుందని తెలుస్తోంది. ఒక ట్రైన్ యొక్క మైలేజ్ దాని ఇంజిన్ శక్తి పై ఆధారపడి ఉంటుంది. దీనిలో తరచుగా ఎత్తు ఎక్కడం,బ్రేకింగ్, లోడ్ లాగడం వంటివి కూడా ఉంటాయని సమాచారం.
Also Read: రైల్వే స్టేషన్‌లో కనిపించే బోర్డులు “పసుపు” రంగులోనే ఎందుకు ఉంటాయో తెలుసా.? కారణం ఇదే.!
End of Article