ఐపీఎల్లో మరొక ఆసక్తికరమైన టువంటి పోరుకు సమయం ఆసన్నమైంది. సన్రైజర్స్ హైదరాబాద్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ఇవాళ తలపడుతున్నాయి. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే డేవిడ్ వార్నర్ తన పాత టీం హైదరాబాద్ పై మ్యాచ్ లో ఆడటమే. ఈ సీజన్ లో వార్నర్ ఢిల్లీ తరఫున ఆడుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే వార్నర్ 2015 నుండి 2021 వరకు హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. ఆయన హయాంలో ఎన్నో విజయాలు అందించాడు.
అలాగే ఐపీఎల్లో అత్యధిక రన్స్ స్కోర్ చేసిన వారిలో ఒకడిగా ఉన్నాడు. 2016లో హైదరాబాద్ జట్టుకు ఐపీఎల్ టైటిల్ కూడా అందించిన ఘనత ఆయనకు ఉంది. హైదరాబాద్ జట్టు అంటే వార్నర్.. అనే పేరును సంపాదించారు ఆయన. కానీ ఆయనకు మేనేజ్మెంట్ తో విభేదాలు రావడంతో వార్నర్ ను కెప్టెన్సీ నుంచి తొలగించారు. ఇక ఆ సీజన్ తర్వాత ఆయనను పూర్తిగా వదులుకుంది. తర్వాత మెగా వేలంలో ఢిల్లీ వార్నర్ ను ఆరు కోట్లకు కొనుగోలు చేసింది. డేవిడ్ వార్నర్ ఆట పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17